Krithi Shetty | ప్రేమ, బ్రేకప్‌పై తొలిసారి ఓపెన్ అయిన కృతి శెట్టి.. నెగిటివ్ కామెంట్స్ చేస్తే బ్లాక్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్!
Krithi Shetty | టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్‌గా మారిన హీరోయిన్ కృతిశెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల వల్ల కాదు, వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Krithi Shetty | టాలీవుడ్‌లో ‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషన్‌గా మారిన హీరోయిన్ కృతిశెట్టి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తన సినిమాల వల్ల కాదు, వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కృతి శెట్టి కెరీర్ ప్రారంభం ఎంతో అద్భుతంగా సాగింది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టి టాలీవుడ్‌లో “లక్కీ హీరోయిన్”గా పేరు తెచ్చుకుంది.
ఊహించని మలుపు..
అయితే ఈ విజయాల తర్వాత కృతి కెరీర్‌లో ఊహించని మలుపు వచ్చింది. వరుసగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచడంతో ఆమె స్పీడ్ తగ్గింది. ముఖ్యంగా యంగ్ హీరోల సరసన చేసిన ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో తెలుగులో అవకాశాలు కొంత తగ్గాయి.
ప్రస్తుతం కృతి శెట్టి తమిళ్, మలయాళ చిత్రాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
లవ్ బ్రేకప్ జరిగింది…
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై కృతి ఓపెన్‌గా మాట్లాడింది. “ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. కానీ నా లైఫ్‌లో ఒకసారి బ్రేకప్ జరిగింది. ఆ విషయం మా అమ్మకు కూడా తెలుసు” అంటూ ఆమె చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పై కూడా కృతి ఘాటుగా స్పందించింది. “ఎవరైనా నాపై నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తే వెంటనే బ్లాక్ చేస్తా” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీస్తున్నాయి.
మొత్తానికి, కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నప్పటికీ కృతి శెట్టి ధైర్యంగా ముందుకు సాగుతోంది. వ్యక్తిగత విషయాల్లో కూడా ఓపెన్‌గా మాట్లాడటం ద్వారా ఆమె తన స్ట్రాంగ్ పర్సనాలిటీని మరోసారి చూపించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram