Monalisa | సినీ పరిశ్రమలో మరోసారి మీటూ తరహా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ‘కుంభమేళా’ ఫేమ్, నటి మోనాలిసా భోంస్లే, దర్శకుడు సనోజ్ మిశ్రాపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె, సినిమా షూటింగ్ సమయంలో తన పట్ల దర్శకుడు అసభ్యంగా ప్రవర్తించాడని, పలుమార్లు లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ సంఘటనలు జరిగిన సమయంలో తాను మైనర్‌గా ఉన్నానని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
మైనర్‌గా ఉన్నప్పుడు ఎదురైన వేధింపులు
మోనాలిసా భోంస్లే వెల్లడించిన వివరాల ప్రకారం, చిన్న వయసులోనే తనపై జరిగిన ఈ ఘటనలు తనను మానసికంగా తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పారు. కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఈ చేదు అనుభవం తన జీవితం మీద గాఢ ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై త్వరలోనే న్యాయపరంగా పోరాటం ప్రారంభించి పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.
కుటుంబం నుంచి సహకారం లేదు..
ఈ సంఘటనలను అప్పట్లోనే కుటుంబ సభ్యులకు తెలిపినా, వారు తన బాధను పట్టించుకోలేదని మోనాలిసా భోంస్లే ఆవేదన వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన కుటుంబం మౌనం వహించడం తనకు మరింత మానసిక వేదన కలిగించిందని తెలిపారు.
ఇన్నేళ్ల తర్వాత ధైర్యంగా బయటకు వచ్చి ఈ విషయాలను వెల్లడిస్తున్నానని, పరిశ్రమలో ఇతర యువతులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే తన అనుభవాన్ని పంచుకుంటున్నానని చెప్పారు.
ప్రాణహాని ఆరోపణలు..
ఇదిలా ఉండగా, ఇటీవల ఫర్మాన్ ఖాన్‌ని వివాహం చేసుకున్న మోనాలిసా భోంస్లే ప్రస్తుతం తన సొంత కుటుంబం నుంచే ప్రాణహాని ఉందని ఆరోపించారు. కులాంతర/మతాంతర వివాహం కారణంగా తనను, తన భర్తకి హానిచేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విషయంపై ఆమె ఇప్పటికే పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. తన భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఒకవైపు పాత లైంగిక వేధింపుల ఆరోపణలు, మరోవైపు ప్రస్తుత ప్రాణహాని భయం ఈ రెండు అంశాలు కలిసి మోనాలిసా భోంస్లే వ్యవహారాన్ని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మార్చాయి. సినీ పరిశ్రమలో మహిళల భద్రత, హక్కులపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.
