NTR | నారా లోకేష్‌కి సినీ–రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు.. ప్రత్యేక ఆకర్షణగా ఎన్టీఆర్ ట్వీట్
NTR | ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల సందడి కొనసాగుతోంది. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
NTR | ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల సందడి కొనసాగుతోంది. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యేక చర్చకు దారి తీసింది. “జన్మదిన శుభాకాంక్షలు లోకేష్. మీ జీవితంలో ఇది మరో మంచి సంవత్సరం కావాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది. ఈ శుభాకాంక్షలు నారా, నందమూరి కుటుంబాల అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. రాజకీయాలకు, సినిమాలకు చెందిన రెండు ప్రముఖ కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ట్వీట్ మరోసారి గుర్తు చేసింది.
నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ బంధుత్వ పరంగా బావా–బావమరుదులు కావడం తెలిసిందే. ఒకరు రాజకీయాల్లో, మరొకరు సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ, ప్రత్యేక సందర్భాల్లో పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా పుట్టినరోజుల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఈ అభినందనలు కనిపిస్తుంటాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఇద్దరూ ఒకే ఏడాది, 1983లో జన్మించగా, కేవలం కొన్ని నెలల తేడాతో వారు పుట్టడం తరచూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్టీఆర్ ట్వీట్‌పై సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి.
కొందరు “ఇదే బావ–బావమరుదుల బాండింగ్” అంటూ స్పందిస్తుంటే, మరికొందరు “ఇలా పరస్పరం గౌరవంతో విషెస్ చెప్పుకోవడం బాగుంది” అంటూ అభినందనలు తెలుపుతున్నారు. నారా, నందమూరి అభిమానులు ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు నెలల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉండటంతో, ఆ రోజు లోకేష్ కూడా ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతారనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.
రాజకీయంగా చూస్తే, నారా లోకేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘యువగళం’ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఆయన, 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి తన రాజకీయ బలం చాటుకున్నారు. పార్టీ అధికారంలోకి రావడంలో లోకేష్ పాత్ర కీలకమని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
యువ నాయకుడిగా, భవిష్యత్‌పై దృష్టి పెట్టి పనిచేస్తున్న నేతగా నారా లోకేష్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనలో ఉన్నప్పటికీ, ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన శుభాకాంక్షల ట్వీట్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క పోస్ట్‌తో నారా–నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram