OTT Movies | ఓటీటీలో ఈ రోజు సంద‌డే సంద‌డి… ఒక్కరోజే 26 సినిమాలు రిలీజ్, అందులో 17 స్పెషల్!

OTT Movies | డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఇవాళ పండుగరోజు అని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్ తదితర ఫ్లాట్‌ఫామ్స్‌లో ఏప్రిల్ 17న ఒక్కరోజే ఏకంగా 26 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వివిధ భాషల్లో వచ్చిన ఈ కంటెంట్‌లో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హారర్, రొమాన్స్ వంటి అన్ని జానర్లూ ఉన్నాయి.

  • By: Sandeep |    movies |    Published on : Apr 17, 2026 9:54 AM IST
OTT Movies | ఓటీటీలో ఈ రోజు సంద‌డే సంద‌డి… ఒక్కరోజే 26 సినిమాలు రిలీజ్, అందులో 17 స్పెషల్!

OTT Movies | డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులకు ఇవాళ పండుగరోజు అని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్ తదితర ఫ్లాట్‌ఫామ్స్‌లో ఏప్రిల్ 17న ఒక్కరోజే ఏకంగా 26 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వివిధ భాషల్లో వచ్చిన ఈ కంటెంట్‌లో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, హారర్, రొమాన్స్ వంటి అన్ని జానర్లూ ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌లు:

‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’, ‘ఆగ్రా’, ‘మట్కా కింగ్’, ‘బాలిస్టిక్’, ‘బ్రదర్స్ అండర్ ఫైర్’, ‘ది నాపాబాయ్స్’, ‘ది విజిలర్స్’, ‘అమెరికన్ గ్లాడియేటర్స్’ వంటి చిత్రాలు, షోలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్:

‘దో దివానే షెహర్ మే’, ‘ఆల్ఫా మేల్స్ సీజన్ 5’, ‘అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ రొమాన్స్’, ‘180’, ‘రూమ్‌మేట్స్’, ‘గోరిల్లా స్టోరీ’, ‘ఫుల్ స్వింగ్ సీజన్ 4’, ‘ట్విస్టెడ్’, ‘లెగో ఫ్రెండ్స్: ది నెక్ట్స్ చాప్టర్’ వంటి కంటెంట్ ప్రేక్షకులను అలరిస్తోంది.

తెలుగు కంటెంట్ ప్రత్యేకం:

తెలుగు ప్రేక్షకులకు ‘హాఫ్ హాఫ్’, ‘మా ఇంటి కథ’, ‘పోచమ్మ’ వంటి కంటెంట్ మంచి ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా కుటుంబ కథలు, రొమాంటిక్ కామెడీ, మిస్టరీ హారర్ అంశాలతో వచ్చిన ఈ షోలు ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో:

జీ5లో ‘అస్సీ’, ‘ఆశకల్ అయిరామ్’, ఆహాలో ‘పోచమ్మ’, లయన్స్ గేట్ ప్లేలో ‘గుడ్ బాయ్’, బుక్ మై షోలో ‘ది బ్రైడ్’, హెచ్‌బీవో మ్యాక్స్‌లో ‘డస్ట్ బన్నీ’, హులు‌లో ‘షెల్బీ ఓక్స్’ వంటి సినిమాలు విడుదలయ్యాయి.

స్పెషల్ లిస్ట్:

ఈ 26 రిలీజ్‌లలో సుమారు 17 సినిమాలు, సిరీస్‌లు ప్రత్యేకంగా చూడదగినవిగా గుర్తింపు పొందుతున్నాయి. ముఖ్యంగా ‘అస్సీ’, ‘హాఫ్ హాఫ్’, ‘మా ఇంటి కథ’, ‘పోచమ్మ’, ‘మట్కా కింగ్’, ‘గుడ్ బాయ్’, ‘ది బ్రైడ్’, ‘షెల్బీ ఓక్స్’, ‘డస్ట్ బన్నీ’, ‘రూమ్‌మేట్స్’, ‘180’, ‘దో దివానే షెహర్ మే’, ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’, ‘ఆగ్రా’ వంటి కంటెంట్ ఎక్కువగా హైలైట్ అవుతోంది.

మొత్తంగా చూస్తే, ఒక్కరోజులోనే ఇంత భారీగా కంటెంట్ రిలీజ్ కావడం అరుదైన విషయమే. వీటిలో ముఖ్యంగా 4 తెలుగు కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓటీటీ ప్రేమికులకు ఈ వీకెండ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని చెప్పొచ్చు.