OTT | ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు.. పెద్ద హీరోల సినిమాల‌తో సంద‌డే సంద‌డి

OTT | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఏప్రిల్ 12 నుంచి 19 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విభిన్న భాషల‌కి సంబంధించిన‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూ వినోదాన్ని రెట్టింపు చేయనున్నాయి. హాలీవుడ్, కొరియన్ డ్రామాలు, కామెడీ షోలు, అలాగే తెలుగు సినిమా కూడా ఈ వారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

  • By: Sandeep |    movies |    Published on : Apr 13, 2026 9:03 AM IST
OTT | ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు.. పెద్ద హీరోల సినిమాల‌తో సంద‌డే సంద‌డి

OTT | ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఏప్రిల్ 12 నుంచి 19 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విభిన్న భాషల‌కి సంబంధించిన‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూ వినోదాన్ని రెట్టింపు చేయనున్నాయి. హాలీవుడ్, కొరియన్ డ్రామాలు, కామెడీ షోలు, అలాగే తెలుగు సినిమా కూడా ఈ వారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో..

ప్రధానంగా నెట్‌ఫ్లిక్స్‌లో లో ఈ వారం భారీగా కంటెంట్ విడుదల కానుంది. అందులో ముఖ్యంగా ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 16, 2026న స్ట్రీమింగ్‌కు రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించకపోయిన ఈ సినిమా, ఇప్పుడు OTTలో ఎలా స్పందన అందుకుంటుందో చూడాలి.

ఇక ఆల్ఫా మేల్స్ సీజ‌న్ 5 ఏప్రిల్ 17న విడుదల కానుంది. మిడిల్ ఏజ్ సమస్యలు, ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సంఘటనలతో ఈ సీజన్ నవ్వులు పంచనుంది.

అలాగే రూమ్ మేట్స్ కూడా అదే రోజు విడుదలవుతుంది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇద్దరు రూమ్‌మేట్స్ మధ్య జరిగే ఫన్నీ సంఘటనలతో ఈ మూవీ రూపొందింది.

జియో హాట్ స్టార్‌లో..

జియో హాట్ స్టార్ లో యుఫోరియా సీజ‌న్ 3 ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్‌లో కథ హైస్కూల్ తర్వాత ఐదు సంవత్సరాల టైమ్ జంప్‌తో పెద్దల జీవితంలోకి ప్రవేశిస్తుంది. ప్రధాన పాత్రలో జెండ‌యా నటన మరోసారి ఆకట్టుకోనుంది. ప్రతి వారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది.

వికీలో కొరియన్ డ్రామా రీ-ఎంట్రీ:

వికీలో మూడు సంవత్సరాల తర్వాత ప్రముఖ కొరియన్ డ్రామా కొత్త సీజన్ ఏప్రిల్ 13న విడుదలైంది. యుమీ జీవితంలో వచ్చిన మార్పులు, ఆమె ప్రేమ కథ చివరి దశ ఈ సీజన్‌లో చూపించబడుతుంది. లైవ్ యాక్షన్‌తో పాటు యానిమేషన్ మేళవింపు ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అన్ని వర్గాల ప్రేక్షకులకు సరిపడే కంటెంట్ అందుబాటులోకి రానుంది. యాక్షన్, కామెడీ, డ్రామా, రొమాన్స్ ఇలా విభిన్న జానర్లతో వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది సరైన సమయం. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను, కొత్త వెబ్ సిరీస్‌లను ఇంట్లోనే ఆస్వాదించేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు.