Peddi | ‘పెద్ది’ రిలీజ్ మళ్లీ వాయిదా … రామ్ చరణ్ మూవీపై పెరుగుతున్న సందేహాలు

Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్‌పై సందేహాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది.

Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవెయిటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ రిలీజ్‌పై సందేహాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా మారే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెల రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఇంకా షూటింగ్ పూర్తికాకపోవడం ప్రధాన కారణంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఒక స్పెషల్ సాంగ్‌తో పాటు రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

వాయిదా త‌ప్ప‌దా..

ఈ షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, మ్యూజిక్ ఫైనలైజేషన్, ప్రమోషన్స్ ఇవన్నీ కేవలం 30 రోజుల్లో పూర్తి చేయడం కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో మళ్లీ రిలీజ్ వాయిదా పడుతుందనే ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఇలాంటి వార్తలు గతంలో కూడా వచ్చినప్పుడు మూవీ టీం స్పందించింది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది పహిల్వాన్’ పేరుతో ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసి, ఏప్రిల్ 30నే రిలీజ్ డేట్‌గా ప్రకటించింది. అంతేకాదు, ఓవర్సీస్ బుకింగ్స్ కూడా త్వరలో ప్రారంభమవుతాయని సంకేతాలు ఇచ్చింది.

అయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. షూటింగ్ పెండింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల భారం, ప్రమోషన్ల సమయం అన్నీకలిపి చూస్తే డెడ్‌లైన్ అందుకోవడం కష్టమనే భావన వ్యక్తమవుతోంది. అధికారికంగా టీం మరోసారి క్లారిటీ ఇవ్వకపోతే ఈ రూమర్స్ ఆగేలా కనిపించడం లేదు.

భారీ స్టార్ కాస్ట్, టెక్నికల్ టీం

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంగీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, నిర్మాణ బాధ్యతలను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్వహిస్తున్నారు.

అభిమానుల్లో ఆందోళన

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందనే వార్తలు మెగా అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఇకపై మూవీ టీం అధికారిక ప్రకటనపై అందరి దృష్టి నిలిచింది. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Latest News