Heroine | గతంలో సినిమాల్లో మెరిసిన పలువురు నటీనటులు కాలక్రమేణా జీవన పరిస్థితుల కారణంగా పూర్తిగా మారిపోతుంటారు. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటి పూజ దద్వాల్. ఒకప్పుడు సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందిన ఈ నటి ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన పూజ దద్వాల్ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఆమెకు సినీ రంగంలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో, తర్వాత వివాహం చేసుకుని గోవాలో భర్తతో కలిసి జీవితం ప్రారంభించింది.
టీబీ వలన దెబ్బ తిన్న ఆరోగ్యం..
అయితే ఆమె జీవితంలో పెద్ద మలుపు తీసుకొచ్చింది క్షయవ్యాధి (టిబి). ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ సభ్యులు కూడా ఆమెను దూరం చేసుకున్నారని సమాచారం. చివరకు ముంబైలో ఒంటరిగా మిగిలిపోయిన పూజ దద్వాల్ తీవ్ర కష్టాలు ఎదుర్కొంది.
ఆ సమయంలో సహాయం కోసం ఆమె సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయగా, సల్మాన్ ఖాన్ స్పందించి ఆమెకు చికిత్స, ఆహారం, అవసరమైన సహాయం అందించారు. ఆయన సహాయంతో పూజ తిరిగి కోలుకుని కొత్త జీవితం ప్రారంభించగలిగింది.
లప్రస్తుతం ముంబైలో చిన్న ఇల్లు తీసుకుని, స్వయం ఉపాధి కోసం టిఫిన్ సెంటర్ నిర్వహిస్తోంది. రోజువారీ ఆదాయంతోనే జీవనం సాగిస్తూ స్వాభిమానంతో ముందుకు సాగుతోంది. ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో మెరిసిన నటి, ఇప్పుడు సాధారణ జీవితాన్ని గడుపుతున్న తీరు పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది. సినీ పరిశ్రమ ఆమెను ఆదుకోవాలని, మళ్లీ మంచి అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు.
