Ram Charan | పెద్ది షూటింగ్‌లో అప‌శృతి.. రామ్ చ‌ర‌ణ్‌కి గాయం, టెన్ష‌న్ ప‌డొద్దంటున్న మేక‌ర్స్

Ram Charan | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ గాయపడినట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది.

Ram Charan rugged look from Peddi movie poster

చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం

Ram Charan | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ గాయపడినట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం చరణ్ తన కొత్త చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదట మార్చి 27న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో షూటింగ్‌ను వేగవంతం చేశారు.

కంటికి స్వ‌ల్ప గాయం..

ఈ క్రమంలోనే ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు రామ్ చ‌ర‌ణ్‌ కంటికి స్వల్ప గాయం అయినట్టు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశంలో చిన్న అపశృతి చోటుచేసుకున్నప్పటికీ, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని చిత్ర యూనిట్ తెలిపింది.

చిత్ర బృందం ప్రకారం, చరణ్‌కు చిన్న గాయం మాత్రమే అయిందని, వైద్యులు 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు.

క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్..

ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కంగారు పడుతూ కామెంట్లు పెట్టినా, ఇప్పుడు క్లారిటీ రావడంతో కొంత ఊరట పొందుతున్నారు. మరోవైపు, సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని, నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 30న ‘పెద్ది’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం పనిచేస్తోంది.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు స‌న‌, గతంలో ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ‘పెద్ది పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మొత్తానికి, గాయంపై వచ్చిన వార్తలు అభిమానుల్లో కలవరపెట్టినా, అది చిన్నదే కావడంతో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టమైంది. ఇప్పుడు అందరి దృష్టి ‘పెద్ది సినిమా విడుదలపై ఉంది.

Latest News