Rashmika | 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసిన రష్మిక.. ‘మైసా’ కోసం ప్రాణాలకే తెగించిన నేషనల్ క్రష్

Rashmika | తెర‌పై క‌నిపించే కొన్ని గంట‌ల వినోదం కోసం న‌టీన‌టులు ఎలాంటి హార్డ్ వ‌ర్క్ చేస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన సాహసం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘మైసా’ సినిమా కోసం ఆమె చేసిన రిస్కీ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rashmika | తెర‌పై క‌నిపించే కొన్ని గంట‌ల వినోదం కోసం న‌టీన‌టులు ఎలాంటి హార్డ్ వ‌ర్క్ చేస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేసిన సాహసం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘మైసా’ సినిమా కోసం ఆమె చేసిన రిస్కీ స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన రష్మిక, ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలతో కొత్త దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఆమె హిందీలో ‘కాక్‌టెయిల్ 2’, తెలుగులో ‘మైసా’, అలాగే ‘రణబలి’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా ‘రణబలి’లో తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

8 గంట‌ల చొప్పున క‌ఠిన‌మైన ట్రైనింగ్..

ఇదిలా ఉండగా, దర్శకుడు రవీంద్ర పులే తెరకెక్కిస్తున్న ‘మైసా’ కోసం రష్మిక తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో భాగంగా ఆమెకు భారీ స్టంట్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఆమె, బ్యాంకాక్‌లో వారం రోజుల పాటు రోజుకు 8 గంటల చొప్పున కఠినమైన ట్రైనింగ్ పూర్తి చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద షూటింగ్ జరుగుతుండగా, అక్కడే రష్మిక దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్టంట్ సమయంలో ఆమె చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు అయినప్పటికీ, ఎలాంటి విరామం తీసుకోకుండా షూటింగ్ కొనసాగించడం విశేషం.

డూప్ లేకుండా సాహ‌సం..

సాధారణంగా ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ కోసం హీరోలు, హీరోయిన్లు డూప్‌లను ఉపయోగిస్తుంటారు. కానీ రష్మిక మాత్రం ఎలాంటి డూప్ లేకుండా స్వయంగా ఈ సాహసం చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె డెడికేషన్‌కు ఇది నిదర్శనమని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

ఇక రష్మిక వ్యక్తిగత నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఆమె కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందినది. ఈ వర్గానికి యుద్ధ విద్యలు, ధైర్యసాహసాలు ప్రత్యేక గుర్తింపు. చిన్ననాటి నుంచే కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీ వంటి శిక్షణలు పొందే సంప్రదాయం ఉండటంతో, రష్మికలో కూడా ఆ ధైర్యం ప్రతిబింబిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

‘మైసా’ కోసం రష్మిక చేసిన ఈ రిస్కీ స్టంట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి.

Latest News