Samantha | టాలీవుడ్‌లో ఒకప్పుడు ఆదర్శ జంటగా నిలిచిన నాగచైతన్య – సమంత విడాకుల వ్యవహారం ఇప్పటికీ అభిమానుల్లో చర్చకు దారి తీస్తూనే ఉంది. సంవత్సరాలు గడిచినా ఈ విషయం పూర్తిగా మరుగున పడలేదు.
‘ఏం మాయ చేసావే’ సినిమా సమయంలో పరిచయం పెరిగి ప్రేమగా మారిన ఈ జంట, కొన్నేళ్ల డేటింగ్ అనంతరం 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ అనూహ్యంగా 2021లో విడాకులు తీసుకోవడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.
బంధాలు తెగిపోలేదు..
విడాకుల తర్వాత ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారు. నాగచైతన్య, శోభితా దూళిపాళ్లను వివాహం చేసుకోగా, సమంత కూడా దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే విడాకుల తర్వాత అక్కినేని కుటుంబంతో సమంతకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని భావించినప్పటికీ, తాజా పరిణామాలు మాత్రం వేరే కోణాన్ని చూపిస్తున్నాయి. ఇటీవల సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో తెరకెక్కిన డెకాయిట్ సినిమా విడుదల సందర్భంగా సమంత సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్ట్ పెట్టింది.
సుప్రియకు బెస్ట్ విషెస్..
సుప్రియను ఉద్దేశిస్తూ .. డెకాయిట్ కోసం నువ్వు పెట్టిన కష్టం, నీ కృషి, పట్టుదల నాకు తెలుసు. బ్లాక్‌బస్టర్ విజయానికి నువ్వు అర్హురాలివి. దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉండాలి అంటూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపింది.
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా విడాకుల తర్వాత కూడా అక్కినేని కుటుంబ సభ్యురాలికి మద్దతు ఇవ్వడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్..
గమనించాల్సిన విషయం ఏమిటంటే, సమంత ఇప్పటికీ అక్కినేని కుటుంబ సభ్యుల సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతుండటం. అంతేకాకుండా, వారిపై ఎప్పుడూ నెగటివ్ కామెంట్స్ చేయకుండా గౌరవాన్ని కాపాడటం కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలను నిర్వహిస్తూ సుప్రియ యార్లగడ్డ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా గుర్తింపు పొందుతోంది. నిర్మాతగా కూడా తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది.
