Sreeleela | టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల వ్యక్తిగత జీవితంపై మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. గత కొన్ని రోజులుగా ఆమె ప్రేమ వ్యవహారంపై పలు వార్తలు వైరల్ అవుతుండగా, తాజాగా మరో కొత్త పేరు తెరపైకి రావడం హాట్ టాపిక్‌గా మారింది.
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ముఖ్యంగా కార్తీక్ ఆర్యన్ తల్లి “మా ఇంటికి వచ్చే కోడలు డాక్టర్ అయి ఉండాలి” అని వ్యాఖ్యానించడంతో, శ్రీలీల వైద్య విద్యాభ్యాసం చేస్తున్న విషయం కారణంగా ఇద్దరి పేర్లను నెటిజన్లు లింక్ చేస్తూ వార్తలు ప్రచారం చేశారు. అయితే ఈ వార్తలపై ఇరువైపుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
ఇప్పుడు క్రికెటర్‌తో..
ఇప్పుడు మరోసారి శ్రీలీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొత్త రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి ఆమె పేరు భారత యువ క్రికెటర్ తిలక్ వర్మతో ముడిపెడుతూ పలు కథనాలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం, శ్రీలీల – తిలక్ వర్మ మధ్య గత కొంతకాలంగా స్నేహం ఉందని, అది ప్రేమగా మారిందని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారానికి మద్దతుగా కొన్ని సంఘటనలను కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు.
ఇవి కూడా కారణాలు..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీలీల తన తల్లితో కలిసి తిరుమల వెళ్లిన సమయంలో, అదే రోజున తిలక్ వర్మ కూడా తన కుటుంబంతో తిరుమలలో కనిపించడం చర్చకు దారితీసింది. అలాగే ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో శ్రీలీల కుటుంబ సభ్యులు ముంబై ఇండియన్స్ జట్టుతో కనిపించారనే ప్రచారం కూడా జరిగింది.
మరోవైపు, ఓ మ్యాచ్ సమయంలో శ్రీలీల స్టేడియంలో కనిపించగా, ఆమెతో ఉన్న వ్యక్తి తిలక్ వర్మ జెర్సీ ధరించాడని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ చిన్న చిన్న సంఘటనలన్నింటినీ కలిపి ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందంటూ రూమర్లు ప్రచారం చేస్తున్నారు.
పూర్తి క్లారిటీ లేదు..
అయితే ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. శ్రీలీల గానీ, తిలక్ వర్మ గానీ ఈ అంశంపై స్పందించలేదు. కేవలం సోషల్ మీడియా ప్రచారం ఆధారంగానే ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక కెరీర్ విషయానికి వస్తే, ప్రారంభంలో వరుస విజయాలతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన శ్రీలీల తర్వాత కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ భాషల్లో కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. కాగా, వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ రూమర్లపై ఆమె స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
