Suma | నిధి చీరలోనే చాలా నిధులున్నాయి.. సుమ మాటలపై డిబేట్
Suma | ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Suma | ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ఈ జానర్‌లో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ముఖ్యంగా నిధి అగర్వాల్‌కు ఈ మధ్య సినిమా ఈవెంట్స్‌లో లభిస్తున్న స్పందన ఆమె పాపులారిటీని మరోసారి రుజువు చేస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘ది రాజా సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిధిని ఉద్దేశించి ఓ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డ్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. “నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి? ఎంత ఆస్తి ఉండాలి?” అంటూ అడిగిన ప్రశ్నలు వేదికపై ఉన్నవారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. యాంకర్ సుమ ఆ విషయాన్ని నిధి దగ్గర ప్రస్తావించగా, ఆమె ఎంతో కూల్‌గా స్పందిస్తూ “ప్రొఫెషన్ ఆఫ్ లవ్‌లో ఉండాలి” అని చెప్పింది. ఈ సమాధానానికి ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది.
ఇంతటితో ఆగకుండా, నిధి స్పీచ్ అనంతరం సుమ “నిధి చీరలోనే అన్ని నిధులూ ఉన్నట్లున్నాయి” అనే సరదా వ్యాఖ్య ఈవెంట్‌కు మరింత హైలైట్‌గా మారింది. అభిమానులు విజిల్స్, చప్పట్లతో స్పందించగా, ఆ క్షణం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ సరదా వ్యాఖ్యలే ఇప్పుడు నెట్టింట మరో డిబేట్‌కు దారితీశాయి. ఇటీవల హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో, సుమ వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “శివాజీ మాట్లాడితే తప్పు అంటారు.. మహిళ అయిన సుమ మాట్లాడితే సరేనా?” అంటూ డబుల్ స్టాండర్డ్స్‌పై చర్చ మొదలైంది. మరోవైపు, ఇది కేవలం సరదాగా చేసిన వ్యాఖ్య మాత్రమేనని, అతి విశ్లేషణ అవసరం లేదని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో కూడా ‘ది రాజా సాబ్’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులు నిధి అగర్వాల్ చుట్టుముట్టడంతో ఆమె అసౌకర్యానికి గురైన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనలతో పాటు తాజా ఈవెంట్ వివాదం కలసి, సినిమా ఈవెంట్స్‌లో హీరోయిన్లకు ఎదురవుతున్న పరిస్థితులపై మరోసారి చర్చను తెరపైకి తెచ్చింది. మొత్తంగా, ‘ది రాజా సాబ్’ సినిమా ప్రమోషన్స్‌తో పాటు నిధి అగర్వాల్ చుట్టూ జరుగుతున్న ఈ ఘటనలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ చర్చలు మరింత ఊపందుకునే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram