Tejaswini | బాలయ్య కూతురిలో ఈ టాలెంట్ కూడా ఉందా?.. తేజస్విని డ్యాన్స్ వీడియోకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Tejaswini | నందమూరి కుటుంబ సభ్యులు సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అయితే ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని మాత్రం తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Tejaswini | నందమూరి కుటుంబ సభ్యులు సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అయితే ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని మాత్రం తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిర్మాతగా, క్రియేటివ్ కన్సల్టెంట్‌గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు తన డ్యాన్స్ టాలెంట్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని చేసిన డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాట బీట్‌కు తగ్గట్టుగా ఆమె చూపించిన గ్రేస్, ఎనర్జీ, స్టెప్స్ చూసి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం తేజస్వినిలో దాగి ఉన్న ఈ టాలెంట్ ఇప్పుడు బయటపడటంతో నందమూరి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

డ్యాన్స్ వీడియోతో అద‌ర‌గొట్టింది..

“బాలయ్య కూతురు మల్టీ ట్యాలెంటెడ్”, “డ్యాన్స్ కూడా ఇంత అద్భుతంగా చేస్తారా?”, “సినిమాల్లోకి వస్తే హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇస్తారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ జ్యువెలరీ ప్రకటనలో నటించి ఆకట్టుకున్న తేజస్విని.. ఇప్పుడు డ్యాన్స్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు.

సినీ పరిశ్రమలో తేజస్విని పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రసారమైన Unstoppable with NBK కార్యక్రమం వెనుక ఆమె కీలక పాత్ర పోషించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. ఆ షోకు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌, కన్సల్టెంట్‌గా పనిచేసిన తేజస్విని.. తన తండ్రి బాలకృష్ణ సినిమాల ఎంపికలో కూడా సలహాలు ఇస్తారని సన్నిహితులు చెబుతున్నారు.

ప్ర‌తిభ చాటుకుంటున్న తేజ‌స్విని

ఇక నందమూరి కుటుంబంలో పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి ఇప్పటికే వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోగా, తేజస్విని కూడా క్రమంగా ప్రజల్లోకి వస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. నటన, నిర్మాణం, క్రియేటివ్ ప్లానింగ్ తర్వాత ఇప్పుడు డ్యాన్స్‌తో ఆకట్టుకోవడంతో భవిష్యత్తులో ఆమె వెండితెరపై కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అప్‌డేట్ వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తేజస్విని డ్యాన్స్ వీడియోనే హాట్ టాపిక్‌గా మారింది.

Latest News