TGFA | ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025.. ఎవరికెవరికీ ఏ అవార్డులు? ఎంత ప్రైజ్ మనీ?

TGFA | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025” కార్యక్రమం మార్చి 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.

TGFA | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025” కార్యక్రమం మార్చి 19న ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటు సినీ ప్రముఖులు చిరంజీవి, క‌మ‌ల్ హాస‌న్, నాగార్జున హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సుమ క‌న‌కాల‌, ప్ర‌దీప్ హోస్ట్ చేశారు.

ప్రత్యేక అవార్డులు

బెస్ట్ బుక్ అవార్డు: ప్రభు – ₹3 లక్షలు, సిల్వర్ మెమెంటో, ప్రశంసా పత్రం

బెస్ట్ క్రిటిక్: హెచ్ రమేష్ – ₹3 లక్షలు, సిల్వర్ మెమెంటో, ప్రశంసా పత్రం

డాక్యుమెంటరీ & షార్ట్ ఫిలిం అవార్డులు

డాక్యుమెంటరీ విభాగం:

ఫస్ట్ బెస్ట్: “యూనిటీ – ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్” – ₹5 లక్షలు, గోల్డెన్ మెమెంటో

సెకండ్: “పైడి జయరాజ్” – ₹3 లక్షలు, సిల్వర్ మెమెంటో

థర్డ్: “డాక్టర్ AS రావు” – ₹1 లక్ష, కాంస్య మెమెంటో

 

షార్ట్ ఫిలిం విభాగం:

ఫస్ట్: “వనజీవి రామయ్య” – ₹5 లక్షలు

సెకండ్: “మౌనమే నీ భాష” – ₹3 లక్షలు

థర్డ్: “సైబర్ స్లేవరీ” – ₹1 లక్ష

స్పెషల్ జ్యూరీ అవార్డులు

దర్శకుడు, నటుడు, నటి, సహనటుడు విభాగాల్లో విజేతలకు ఒక్కొక్కరికి ₹3 లక్షలు, సిల్వర్ మెమెంటో అందజేశారు.

టెక్నికల్ & క్రియేటివ్ అవార్డులు

కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, యాక్షన్ కొరియోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ వంటి విభాగాల్లో విజేతలకు ₹5 లక్షలు చొప్పున సిల్వర్ మెమెంటోలు అందించారు.
ఈ విభాగాల్లో శ్రీక‌ర్ ప్ర‌సాద్, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని వంటి ప్రముఖులు అవార్డులు అందుకున్నారు.

సంగీత విభాగం

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కె రాబిన్ – ₹5 లక్షలు

బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్: సాహితి చాగంటి – ₹5 లక్షలు

బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: అనురాగ్ కులకర్ణి – ₹5 లక్షలు

నటన విభాగం

బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్: ర‌ష్మిక మంధాన‌ – ₹10 లక్షలు

బెస్ట్ లీడింగ్ యాక్టర్: నాగ చైత‌న్య‌ – ₹10 లక్షలు

సపోర్టింగ్ యాక్టర్ & యాక్ట్రెస్: ₹3 లక్షలు, కాంస్య మెమెంటో

ఫీచర్ ఫిలిం అవార్డులు

మొదటి బెస్ట్ ఫీచర్ ఫిలిం: “రాజు వెడ్స్ రాంబాయి”

నిర్మాత – ₹10 లక్షలు, గోల్డెన్ మెమెంటో

దర్శకుడు – ₹5 లక్షలు

రెండో బెస్ట్ ఫిలిం: “దండోరా” – నిర్మాతకు ₹7 లక్షలు

మూడో బెస్ట్ ఫిలిం: “ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” – ₹5 లక్షలు

ప్రత్యేక గౌరవ అవార్డులు (ప్రతి ఒక్కరికి ₹10 లక్షలు)

చిరంజీవి – ఎన్టీఆర్ నేషనల్ అవార్డు

సింగీతం శ్రీనివాస‌రావు – బి.ఎన్ రెడ్డి అవార్డు

అశ్వినీద‌త్ – నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు

సుద్దాల అశోక్ తేజ‌ – సి.నారాయణ రెడ్డి అవార్డు

జ‌య‌సుధ‌ – అక్కినేని నాగేశ్వరరావు అవార్డు

ఆర్ నారాయ‌ణ‌రావు – కాంతారావు అవార్డు

ర‌మేష్ ప్ర‌సాద్ – రఘుపతి వెంకయ్య అవార్డు

క‌మ‌ల్ హాస‌న్ – పైడి జైరాజ్ అవార్డు

జ్యూరీ సభ్యులకు గౌరవం

జ్యూరీ చైర్మన్‌లకు ₹2 లక్షలు, గోల్డెన్ మెమెంటోలు ఇవ్వగా, ఇతర జ్యూరీ సభ్యులకు కూడా గౌరవ బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుక తెలుగు సినీ పరిశ్రమ ప్రతిభను ఘనంగా సత్కరించిన వేదికగా నిలిచింది. భారీ నగదు బహుమతులు, గౌరవ మెమెంటోలు ఈ అవార్డులకు ప్రత్యేకతను తీసుకువచ్చాయి.

Latest News