Tollywood | 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు ఇవే.. ఏ సినిమాకి ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భించింది అంటే..!

Tollywood | 2025లో విడుదలైన తొలి బ్లాక్‌బస్టర్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చరిత్ర సృష్టించింది. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అనూహ్యంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రీజినల్ ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది.

  • By: sn |    movies |    Published on : Dec 16, 2025 3:23 PM IST
Tollywood | 2025లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు ఇవే.. ఏ సినిమాకి ఎక్కువ ఆద‌ర‌ణ ల‌భించింది అంటే..!

Tollywood | 2025లో విడుదలైన తొలి బ్లాక్‌బస్టర్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చరిత్ర సృష్టించింది. జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, అనూహ్యంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రీజినల్ ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ, నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో వ‌చ్చిన‌ ‘గేమ్ ఛేంజర్’ కి ఊహించ‌ని షాక్ ఇచ్చింది.

‘డాకు మహారాజ్’ – మాస్ ఎంటర్‌టైనర్ అయినా దెబ్బ తప్పలేదు

జనవరి 12న విడుదలైన ‘డాకు మహారాజ్’ బ్రేక్ ఈవెన్‌కు చాలా దగ్గరగా వెళ్లి సెమీ హిట్‌గా నిలిచింది. అయితే, రెండు రోజుల తేడాతో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రభంజనం కారణంగా ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు తగ్గాయి. అయినప్పటికీ, 2025లో వచ్చిన బెస్ట్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా అభిమానుల ఆదరణ దక్కించుకుంది.

ఫిబ్రవరి–మార్చిలో లాభాల పంట

ఫిబ్రవరిలో వచ్చిన ‘తండేల్’ మూవీ అక్కినేని నాగచైతన్యకు మంచి కమ్‌బ్యాక్ సక్సెస్ ఇచ్చింది. మార్చి 14న విడుదలైన ‘కోర్ట్’ మూవీ సంచలన విజయం సాధించింది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి భారీ లాభాలు తెచ్చింది. మార్చి చివర్లో వచ్చిన ‘మ్యాడ్ స్క్వైర్’ కూడా దాదాపు రూ.70 కోట్ల గ్రాస్ సాధించి నిర్మాతలకు మంచి రిటర్న్స్ ఇచ్చింది.

నాని హిట్ ట్రాక్.. శ్రీ విష్ణు కెరీర్ బెస్ట్

మే 1న విడుదలైన నాని ‘హిట్ 3’ మూవీ రూ.110 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆయన హిట్ ట్రాక్‌ను కొనసాగించింది. ఆ తర్వాతి వారం శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘సింగిల్’ రూ.40 కోట్ల కలెక్షన్లతో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సమంత నిర్మించిన ‘శుభమ్’ కూడా మంచి లాభాలు తెచ్చి పెట్టింది.

జూన్ నుంచి యానిమేషన్ సంచలనం వరకు

జూన్ 20న విడుదలైన శేఖర్ కమ్ముల ‘కుబేరా’ తెలుగులో మంచి లాభాలు సాధించింది. జూలైలో డైరెక్ట్ తెలుగు సినిమాలు పెద్దగా కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి. అయితే యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహా’ భారీ వసూళ్లతో లాభాల పంట పండించింది.

సెప్టెంబర్ సూపర్ హిట్స్

సెప్టెంబర్ 5న విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ రూ.2.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.40 కోట్ల వసూళ్లు సాధించి హ్యూజ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘కిష్కింధపురి’, ‘మిరాయ్’ సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. సెప్టెంబర్ చివర్లో వచ్చిన ‘ఓజీ’ మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్‌ను అందుకోలేకపోయింది.

చివరి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలు

అక్టోబర్‌లో కిరణ్ అబ్బవరం నటించిన ‘K-ramp’ మంచి లాభాలు అందుకుంది. నవంబర్‌లో వచ్చిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. నవంబర్ 21న విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రం సూపర్ సక్సెస్‌గా నిలిచింది.

ఓవరాల్ బాక్సాఫీస్ విన్నర్ – వెంకటేష్

డిసెంబర్ మూడో వారం వరకు విడుదలైన సినిమాలన్నింటిని పరిగణలోకి తీసుకుంటే, అన్ని ఏరియాల్లో భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక తెలుగు సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. 2025లో విక్టరీ వెంకటేష్ అసలైన బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచాడు. ఏడాది చివరి వారంలో అరడజనుకి పైగా సినిమాలు విడుదలవుతున్నప్పటికీ, అవి మిడియం బడ్జెట్ చిత్రాలు కావడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్థాయిని, వెంకీ రికార్డును టచ్ చేయడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.