విధాత : టాక్సిక్ సినిమాను ఫ్యామిలీతో చూడకండని..ఈ సినిమాలో మొత్తం అశ్లీలత, డ్రగ్స్,నరుకుడూ, చంపుడు తప్ప మరొకటి లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. నిన్న తాను టాక్సిక్ సినిమాను మా ఫ్రెండ్స్ తో చూద్దామని వెళ్ళి మధ్యలోనే బయటకు వచ్చానని, ఫ్రెండ్స్ తో కలిసి కూడా సినిమా చూసేలా లేదని విమర్శించారు. టాక్సిక్ మూవీలో డ్రగ్స్, హత్యలు, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రదర్శన తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం కనిపించలేదు అని, దీని ద్వారా సమాజానికి ఏమీ మెసెజ్ ఇస్తున్నట్టు? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఎలాంటి విషయం లేని ఇలాంటి సినిమాలకు బదులుగా అశ్లీలతకు బదులు ఆధ్యాత్మికత, ధర్మం, దేశభక్తి, సామాజిక బాధ్యతను చూపించే సినిమాలు రావాలని సూచించారు.
అదే ఇరుముడి రవితేజ సినిమా అయితే ఆధ్యాత్మికత, సమాజం, బాధ్యత ఇవన్నీ ఉన్నాయి అని రాజాసింగ్ కితాబు ఇచ్చారు. అలాగే ఛావా సినిమా ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజు ధైర్యం సాహసాలు, ధర్మం గురించి,దేశ భక్తి గురించి సమాజానికి మంచి మెసెజ్ ఉందన్నారు. సినిమాలు ఇలా ఉండాలి అన్నారు. ఎంతసేపు అశ్లీలత, చంపుడు,కొట్టుడు చూపెట్టి డబ్బులు సంపాదించాలనే మైండ్ సెట్ తో సినిమా తీయొద్దు అని సూచించారు. డైరెక్టర్స్ కూడా సమాజం గురించి ఆలోచించి సినిమాలు తీయాలి అని, కుటుంబంతో కలిసి చూసేలా మంచి మెసేజ్ తో కూడిన సినిమాలు రూపొందించాలని సలహా ఇచ్చారు. ధార్మిక విలువలను కాపాడేలా సినిమా కథను తెరకెక్కించాలని సూచించారు.
టాక్సిక్ మూవీలో నటించిన హీరో యష్‌కు కూడా రాజాసింగ్ సలహా ఇచ్చారు. ఇలాంటి సినిమాల్లో నటించడం వల్ల భవిష్యత్తులో చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, కథలను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
టాక్సిక్ సినిమా చూద్దామని వెళ్ళి మద్యలోనే వచ్చేశా.
-బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్
టాక్సిక్ మూవీని ఫ్యామిలీతో చూడకండి…
టాక్సిక్ సినిమాలో మొత్తం అశ్లీలత, డ్రగ్స్,నరుకుడూ చంపుడు ఉంది.
మా ఫ్రెండ్స్ తో నేను కూడా సినిమాకు పోయినా … జస్ట్ స్టార్టింగ్ లో చూసి బయటకు వచ్చేసా….… pic.twitter.com/m5zMkRO7tW
— Telangana365 (@Telangana365) August 31, 2026
