ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ప్రారంభం : అల్లు సినిమాస్@కోకాపేట్
హైదరాబాద్ కోకాపేట్‌లో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఆసియాలోనే అతిపెద్ద 75 అడుగుల డాల్బీ సినిమా స్క్రీన్, డ్యూయల్ డాల్బీ విజన్ ప్రొజెక్టర్లు, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ థియేటర్ సినీప్రియులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభవాన్ని అందించనుంది.
ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌తో కోకాపేట్‌లో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ నమూనా దృశ్యం.
Allu Cinemas Launch Date Announced: Asia’s Largest Dolby Screen Ready in Hyderabad
హైదరాబాద్ కోకాపేట్‌లో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ఈ నెల 12న ప్రారంభం కానుంది.
ఆసియాలోనే అతిపెద్ద 75 అడుగుల డాల్బీ సినిమా స్క్రీన్, డ్యూయల్ డాల్బీ విజన్ ప్రొజెక్టర్లు,
స్టూడియో గ్రేడ్ డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ థియేటర్ సినీప్రియులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభవాన్ని అందించనుంది.
- హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సినిమా అనుభవం
- ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ థియేటర్
- ఈనెల 12న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
విధాత సినిమా డెస్క్ | హైదరాబాద్:
హైదరాబాద్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అల్లు సినిమాస్’ మల్టీప్లెక్స్ ప్రారంభానికి సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో నిర్మించిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్ హైదరాబాద్ శివార్లలోని కోకాపేట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం ఈ నెల 12న జరగనుందని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ థియేటర్‌ను ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతారని సమాచారం. “Experience the Extraordinary” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఈ మల్టీప్లెక్స్ హైదరాబాద్‌లో సినిమా వీక్షణ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ స్క్రీన్

హైదరాబాద్ కోకాపేట్‌లో నిర్మించిన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ రాత్రి వెలుగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న దృశ్యం.
అల్లు సినిమాస్‌లో ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా చెప్పబడుతోంది. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం నాలుగు హాల్లు ఉండగా, వాటిలో ప్రధానమైన హాల్లో డ్యూయల్ డాల్బీ విజన్ 4K ప్రొజెక్టర్లు, స్టూడియో గ్రేడ్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దాదాపు 75 అడుగుల వెడల్పుతో ఉన్న డీసీఐ ఫ్లాట్ స్క్రీన్(DCI Flat Screen) ఈ థియేటర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రధాన హాల్ 644 సీట్ల సామర్థ్యం కలిగిఉండటం విశేషం.
ఇప్పటివరకు డాల్బీ విజన్ తెరతో భారత్‌లో పుణెలో ఒకటి, బెంగళూరులో ఒక థియేటర్ ఉన్నాయి. కానీ, వాటి తెర సైజు అల్లు సినిమాస్ కంటే తక్కువ.
భారత్‌లో డాల్బీ సినిమా స్క్రీన్లు – పోలిక
| నగరం | థియేటర్ | స్క్రీన్ వెడల్పు |
|---|---|---|
| పుణె | City Pride Multiplex | 55 అడుగులు |
| బెంగళూరు | AMB Cinemas | 65 అడుగులు |
| హైదరాబాద్ | Allu Cinemas (కోకాపేట్) | 75 అడుగులు |
ఈ పోలిక చూస్తే భారత్‌లో ప్రస్తుతం ఉన్న డాల్బీ సినిమా స్క్రీన్లలో హైదరాబాద్ కోకాపేట్‌లోని అల్లు సినిమాస్ స్క్రీన్ పరిమాణం అత్యంత పెద్దదిగా నిలుస్తోంది.
DCI Flat Screen అంటే?

ఇదే డాల్బీ విజన్ డిజిటల్ ఫ్లాట్ స్క్రీన్

డీసీఐ ఫ్లాట్ 1.85:1 స్క్రీన్ నిష్పత్తి ఎలా ఉంటుందో చూపించే నమూనా చిత్రం.
DCI (Digital Cinema Initiatives) అనేది డిజిటల్ సినిమా ప్రొజెక్షన్ ప్రమాణాలను నిర్ధారించే వ్యవస్థ. దీనిలో రకరకాల రిజొల్యూషన్‌తో సినిమాల ప్రమాణాలుంటాయి. ఈ అల్లు సినిమాస్‌లో ఉన్న DCI Flat Screen ప్రమాణాల ప్రకారం, 3996 X 2160(1.85.1) స్పష్టత కలిగిఉంది. ఇది సాధారణ 4కె(3840 X 2160–16:9) కంటే కొంచెం ఎక్కువ. ముఖ్యంగా థియేటర్లలో సినిమా కోసం వాడేది. దీనివల్ల సినిమా అత్యంత స్పష్టంగా ఉంటుంది.
ప్రపంచ స్థాయి దృశ్య నాణ్యత, శక్తివంతమైన డాల్బీ అట్మాస్ సౌండ్ సాంకేతికతతో సినిమా చూడటాన్ని ఒక వినూత్న అనుభూతిగా అందించేందుకు ఈ మల్టీప్లెక్స్ రూపొందించబడింది.
ట్రయల్ రన్ తర్వాత ప్రేక్షకులకు అందుబాటులోకి..
మార్చి 19న #DhurandharTheRevenge మూవీతో ఓపెన్ కాబోతున్న కోకాపేట్‌లోని కొత్త థియేటర్ కాంప్లెక్స్ #AlluCinemas . ఇందులోని నాలుగు స్క్రీన్లలో ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ (75 అడుగుల వెడల్పు) కూడా ఉండటం విశేషం. pic.twitter.com/dPBIpvYxnT
— Yagna The Journalist (@yagnamurthy) February 9, 2026
ప్రారంభోత్సవం అనంతరం కొద్ది రోజుల పాటు సాంకేతిక పరీక్షలు(ట్రయల్ రన్) నిర్వహించనున్నారు. ఈ సమయంలో ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్‌లు సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను పరీక్షించనున్నారు. సమాచారం ప్రకారం ట్రయల్ రన్‌లో బ్రాడ్ పిట్ నటించిన ‘F1’ చిత్రం ప్రదర్శించే అవకాశం ఉంది. మార్చి 12 నుంచి 18 వరకు ట్రయల్ స్క్రీనింగ్ కొనసాగనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సాధారణ ప్రేక్షకుల కోసం టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.
❝
హైదరాబాద్ సినీప్రియులకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభవం అందించాలనే లక్ష్యంతో అల్లు సినిమాస్ నిర్మించాం.
❞
– అల్లు అర్జున్
మొదటి సినిమాగా ‘ధురంధర్ 2’, తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి భారీ సినిమాలతో అల్లు సినిమాస్ తన ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
డాల్బీ సినిమా స్క్రీన్ విశేషాలు
- ప్రధాన స్క్రీన్ వెడల్పు దాదాపు 75 అడుగులు (DCI Flat Ratio).
- డ్యూయల్ డాల్బీ విజన్ 4K లేజర్ ప్రొజెక్టర్లు ద్వారా అత్యంత స్పష్టమైన విజువల్ క్వాలిటీ అందుతుంది.
- స్టూడియో గ్రేడ్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ద్వారా థియేటర్ అంతటా 3D సౌండ్ అనుభూతి ఉంటుంది.
- ప్రధాన స్క్రీన్ సీటింగ్ సామర్థ్యం 644 సీట్లు.
- మొత్తం నాలుగు ఇమ్మర్సివ్ డిజైన్ స్క్రీన్లు ఈ మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రపంచస్థాయి సినిమా సదుపాయాలు పెరుగుతున్న నేపథ్యంలో అల్లు సినిమాస్ ప్రారంభం మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ విజన్ తెరతో ప్రారంభమవుతున్న ఈ మల్టీప్లెక్స్ సినీప్రియులకు మరింత అద్భుతమైన సినిమా అనుభూతిని అందించనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram