Upendra | ఉపేంద్ర కూతురికి సినిమాలంటే ఇష్టం లేదా?.. స్టార్ డాటర్‌పై రియల్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Upendra | సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు తెరంగేట్రం చేయడం కొత్త విషయం కాదు. పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు సులభంగా దొరికినా, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించాలంటే మాత్రం టాలెంట్ నిరూపించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఉపేంద్ర కుమార్తె ఐశ్వర్య గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Upendra | సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు తెరంగేట్రం చేయడం కొత్త విషయం కాదు. పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి అవకాశాలు సులభంగా దొరికినా, ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించాలంటే మాత్రం టాలెంట్ నిరూపించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఉపేంద్ర కుమార్తె ఐశ్వర్య గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రియల్ స్టార్ ఉపేంద్ర కూతురు ఐశ్య‌ర్య ఉపేంద్ర‌ ఇప్పటికే సినీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 2019లో విడుదలైన హౌరా బ్రిడ్జ్ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమైంది. అయితే తర్వాత ఈ సినిమాకు దేవ‌కి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఐశ్వర్య తన తల్లి ప్రియాంక ఉపేంద్రతో కలిసి నటించింది. సినిమాలో ప్రియాంక పోషించిన పాత్ర పేరు ‘దేవకి’ కావడంతో అదే టైటిల్‌గా పెట్టినట్లు దర్శకుడు లోహిత్ అప్పట్లో వెల్లడించారు.

సినిమాల‌కి దూరంగా..

ఈ సినిమాతో శాండల్‌వుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య, ఆ తర్వాత మాత్రం మరో సినిమాలో కనిపించలేదు. తొలి సినిమాకే మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, ఆమె మళ్లీ కెమెరా ముందుకు రాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఐశ్వర్య వయసు 21 ఏళ్లు. హీరోయిన్‌గా బిజీ కావాల్సిన ఈ సమయంలో ఆమె సినిమాలకు దూరంగా ఉండటం వెనుక కారణమేంటనే చర్చ చాలాకాలంగా సాగుతోంది.

ఈ విషయంపై తాజాగా ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “నా కూతురికి తొలి సినిమా తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ తనకు సినిమాలంటే అంత ఆసక్తి లేదు. తన మనసులో ఏముందో మాకు కూడా పూర్తిగా తెలియదు. వస్తున్న అవకాశాలన్నింటినీ తిరస్కరిస్తోంది. అందుకే మేము కూడా ఆమెపై ఒత్తిడి చేయడం లేదు” అని తెలిపారు.

కుమారుడి ఆరంగేట్రం…

అలాగే తన కుమారుడు ఆయుష్ సినీ రంగంలోకి వస్తున్న విషయాన్ని కూడా ఉపేంద్ర వెల్లడించారు. ప్రస్తుతం ఆయుష్ ఓ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్నాడని చెప్పారు. ఈ చిత్రాన్ని శ్రీకల్పవృక్ష మూవీ మేకర్స్ బ్యానర్‌పై అభిషేక్ ఎన్ సిరివంత్ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతోంది. మంచు ప్రాంతాల్లో పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా తర్వాత ఆయుష్ నటనను కొనసాగిస్తాడా లేదా అనేది పూర్తిగా అతని నిర్ణయమేనని ఉపేంద్ర స్పష్టం చేశారు. “నటనంటే ఇష్టమైతే కొనసాగుతాడు.. లేకపోతే తనకు నచ్చిన దారిలో వెళ్తాడు” అని తెలిపారు. ఇప్పుడు ఉపేంద్ర కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆయుష్ తొలి సినిమా హీరోయిన్ ఎవరు? కథ ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

Latest News