వ్యభిచారం చేయమంటూ ఒత్తిడి చేస్తున్న తల్లి – పోలీసులను ఆశ్రయించిన కూతురు
డబ్బు వ్యామోహం ఎంతకైనా తెగింపచేస్తుందనడానికి ఉదాహరణ ఈ ఘటన. కన్నతల్లై ఉండి, కూతురిని వ్యభిచార రొంపిలోకి లాగాలని ప్రయత్నించింది. ఇష్టం లేని కూతురు ఇంట్లోంచి పారిపోయింది.

హైదరాబాద్ అల్వాల్(Alwal)లో జరిగిందీ ఘటన. ఓ తల్లి(Mother) తన కూతురి(Daughter)ని వ్యభిచారం(Flesh Trade) చేయమని రోజూ ఒత్తిడి చేయడంతో పాటు, వేధింపులకు గురి (Harrassment)చేస్తుండటంతో, విసిగిపోయిన కూతురు ఇంట్లో నుండి పారిపోయి స్థానిక పోలీసులను ఆశ్రయించింది. తన తల్లి ఆగడాలపై ఆ అమ్మాయి పోలీసు(Police)లకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
అమ్మాయి బాధలపై వెంటనే స్పందించిన పోలీసులు, తనను సఖి కేంద్రాని(Sakhi Centre)కి తరలించారు. కాగా, గురువారం ఈ విషయం తెలుసుకున్న ఆ మహాతల్లి, ఇంకో మహిళను తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నానా హంగామా(nuisance) సృష్టించింది.
పోలీసులను ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతూ, తన కూతురును తనకు వెంటనే అప్పగించాల్సిందిగా స్టేషన్లో నానా రభస చేసింది. పోలీసులు నిరాకరించి, వెళ్లిపోమ్మని హెచ్చరించడంతో బూతులు తిడుతూ(Abused Police) హంగామా చేయగా, పోలీసులు వారిద్దరిపై కేసు బుక్ చేసి, దర్యాప్తు ప్రారంభించారు.