Varanasi | మెక్సికోలో వార‌ణాసి ప్రివ్యూ.. గ్లోబ‌ల్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారా..!

Varanasi | సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి (Varanasi)’ పాన్ వరల్డ్ స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చగా, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా అదే హైప్ కొనసాగుతోంది.

Super Star Mahesh Babu as RUDRA in SS Rajamouli’s VARANASI

Varanasi | సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి (Varanasi)’ పాన్ వరల్డ్ స్థాయిలో భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటోంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చగా, ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా అదే హైప్ కొనసాగుతోంది.

ఈ సినిమాలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతుండటం విశేషం. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని కొత్త అవతారంలో ఆయన మెరిసేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

అంతర్జాతీయ ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకునేలా..

సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అందిస్తుండగా, కథను ప్రముఖ రచయిత వీ. విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

సినిమా మొత్తం విజువల్ వండర్‌గా రూపొందుతుండగా, ఇందులో ప్రధాన హైలైట్‌గా నిలవబోయేది ‘రామాయణం’ ఎపిసోడ్ అని తెలుస్తోంది. అత్యంత క్లిష్టమైన ఈ భాగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

విశేష స్పంద‌న‌..

ఇక ఈ చిత్రానికి సంబంధించిన అంతర్జాతీయ ప్రమోషన్స్ మెక్సికోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. CCXP Mexico 2026 వేదికగా ‘వారణాసి’ ప్రివ్యూ ప్రదర్శించగా, అక్కడి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఈవెంట్‌కు నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ హాజరై, సినిమాను గ్లోబల్ స్టేజ్‌పై ప్రెజెంట్ చేశారు.

ఈ సందర్భంగా రాజమౌళి విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో, మెక్సికో సంస్కృతి, ప్రత్యేకంగా మాయన్ కల్చర్ తనకు స్ఫూర్తినిచ్చిందని సూచించారు. అలాగే, ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని తెరవెనుక (BTS) వీడియోలు కూడా ఉంటాయని తెలిపారు.

లాటిన్ అమెరికాలో అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్స్‌లో ఒకటైన CCXP Mexicoలో ప్రపంచ స్థాయి సినిమాలు, టీవీ షోలు, కామిక్స్, గేమింగ్, కాస్ప్లే వంటి విభాగాలు ఒకే వేదికపైకి రావడం ప్రత్యేకత. ఈ ఏడాది ఈవెంట్ ఏప్రిల్ 24 నుంచి 26 వరకు జరుగుతుండగా, ఇందులో హాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు.

‘వారణాసి’కి వచ్చిన ఈ అంతర్జాతీయ గుర్తింపు చూస్తుంటే, ఇది నిజంగా పాన్ వరల్డ్ హిట్‌గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేశ్ బాబు – రాజమౌళి కలయికలో వస్తున్న ఈ సినిమా ప్రపంచ సినీ రంగంలో కొత్త మైలురాయిని సృష్టించబోతుందనే అంచనాలు మరింత బలపడుతున్నాయి.

Latest News