Varanasi | దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ మూవీ వారణాసి ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. RRR విజయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి, ఈసారి మరింత భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్లు, అంతర్జాతీయ VFX సంస్థలు పనిచేస్తుండటం విశేషం.
ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నట్లు సమాచారం. కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
సరికొత్త లుక్‌లో మహేష్..
కథ పరంగా ‘వారణాసి’ ఒక గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. హాలీవుడ్ క్లాసిక్ ఇండియానా జోన్స్ తరహాలో హీరో ప్రపంచవ్యాప్తంగా సాహస యాత్రలు చేసే కథగా ఇది తెరకెక్కుతున్నట్లు టాక్. కథను విజయేంద్ర ప్రసాద్ అందించగా, ఇందులో ఆఫ్రికా అడవులు, పురాణాల్లోని హనుమంతుడి లక్షణాలు కీలకంగా ఉండనున్నాయని సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తూ, ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారు.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మినియేచర్ సెట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా కాశీ నగరాన్ని ప్రతిబింబించే ఘాట్లు, ఇరుకైన వీధులు, ఆలయాలను అత్యంత రియలిస్టిక్‌గా తీర్చిదిద్దడం అభిమానులను ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఇలాంటి ఆధ్యాత్మిక నగరాన్ని తెరపై నమ్మదగిన విధంగా చూపించడం కష్టమైనప్పటికీ, రాజమౌళి తన విజన్‌తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కాశీ సెట్‌లో..
ఇప్పటికే ఆఫ్రికా, జార్జియా వంటి ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్రబృందం, ప్రస్తుతం కాశీ సెట్‌లో షూటింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. త్వరలో అంటార్కటికా, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో మిగతా భాగాలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఇండియన్ సినిమాకు మరింత గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న వారణాసిను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అభిమానులు ఈ సినిమాను భారీ స్థాయిలో ఎదురుచూస్తున్నారు.
Hollywood Media కు ఇంత Access ఇచ్చారా రాజమౌళి?
ఇదివరకు ఎప్పుడైనా ఇలా Sets ముందే చూపించారా?#Varanasi pic.twitter.com/9ithqdPi4f
— Journalist Nishant (@NishantOpinions) March 24, 2026
