Vijay Varma | బాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచిన విజయ్ వర్మ – తమన్నా భాటియా ప్రేమకథ ఊహించని విధంగా ముగిసిన విషయం తెలిసిందే. కొంతకాలం పాటు గాఢమైన ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్‌లతో బిజీగా మారిపోయారు.
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. ముంబైలో నటి ఆలియా ఖురేషితో కలిసి కనిపించడం ఇప్పుడు బీ-టౌన్‌లో కొత్త చర్చకు దారితీసింది. ఇద్దరూ కలిసి ఒకే ప్రదేశంలో కనిపించడంతో విజయ్ వర్మ కొత్త డేటింగ్ ప్రారంభించారా? అనే అనుమానాలు నెటిజన్లలో మొదలయ్యాయి.
కెమెరాకి చిక్కిన జంట..
ముంబైలోని ఓ ప్రైవేట్ ప్రదేశంలో విజయ్ వర్మ – ఆలియా ఖురేషి కెమెరాలకు చిక్కిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల విజయ్ నటించిన ‘మట్కా కింగ్’ సిరీస్‌లో ఆలియా కూడా భాగమైంది. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి, అదే డేటింగ్‌కు దారితీసి ఉండొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ కేవలం స్నేహితులేనా? లేక సినిమా ప్రమోషన్‌లో భాగంగా కలిసారా? అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు.
విజయ్ వర్మ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. గతంలో తమన్నాతో ఉన్న రిలేషన్‌షిప్‌ను కూడా చాలా కాలం తర్వాతే అధికారికంగా వెల్లడించారు. అందుకే ఈసారి కూడా ఆయన స్పందించే వరకు ఈ వార్తలు కేవలం రూమర్స్‌గా మిగిలే అవకాశముంది.
జవాన్‌లో కీలక పాత్ర..
ఇక ఆలియా ఖురేషి విషయానికి వస్తే, ఆమె బాలీవుడ్‌లో ఎదుగుతున్న యువ నటి. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు వెబ్ సిరీస్‌లలో కూడా తన నటనతో ఆకట్టుకుంది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది.
సెలబ్రిటీలు కలిసి కనిపించినప్పుడల్లా డేటింగ్ వార్తలు రావడం సినీ పరిశ్రమలో సాధారణమే. అదే విధంగా విజయ్ వర్మ – ఆలియా ఖురేషి జంటపై వస్తున్న ఈ పుకార్లపై వారు స్పందిస్తేనే అసలు విషయం బయటకు రానుంది. అప్పటి వరకు ఈ వార్తలు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా కొనసాగే అవకాశముంది.
