Vijayashanti | బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డం త‌గ్గించిన విజ‌య‌శాంతి.. కార‌ణం ఏంటో తెలుసా?

Vijayashanti | టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన విజ‌య‌శాంతి, ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విజయశాంతి ఇటీవ‌ల‌ తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ‘నిప్పు రవ్వ’ తర్వాత కలిసి సినిమాలు చేయకపోవడానికి గల అసలు కారణాలను ఆమె వివరించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Vijayashanti | టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందిన విజ‌య‌శాంతి, ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విజయశాంతి ఇటీవ‌ల‌ తన సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో ‘నిప్పు రవ్వ’ తర్వాత కలిసి సినిమాలు చేయకపోవడానికి గల అసలు కారణాలను ఆమె వివరించడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

బాలయ్యతో ఎందుకు దూరం?

విజయశాంతి మాట్లాడుతూ… బాలకృష్ణతో కలిసి నటించకపోవడానికి ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేదా కథల కొరత కారణం కాదని స్పష్టం చేశారు. ఆ సమయానికి తన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని, తాను ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా హీరో స్థాయిలో గుర్తింపు పొందానని చెప్పారు.

నా రెమ్యూనరేషన్ పెరిగింది… యాక్షన్ సినిమాలు వరుసగా చేశాను… సహజంగానే నేను ఒక హీరోలా మారిపోయాను. అలాంటి సమయంలో మళ్లీ హీరో పక్కన హీరోయిన్‌గా నటించడం కష్టమే అని ఆమె అన్నారు. అలాంటి పాత్రలు కథాపరంగా, ఆర్థికంగా కూడా భారంగా మారుతాయని వివరించారు.

స్టార్ హీరోలతో సమాన ప్రయాణం

చిరంజీవి, బాలకృష్ణలతో దాదాపు సమాన సంఖ్యలో సినిమాలు చేశానని విజయశాంతి తెలిపారు. ‘గ్యాంగ్ లీడర్’, ‘మెకానిక్ అల్లుడు’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ, ఆ తర్వాత పూర్తిగా హీరోయిన్ సెంట్రిక్ కథలపైనే దృష్టి పెట్టానని చెప్పారు.

తన కెరీర్‌లో ఇంతటి ఇమేజ్ వస్తుందని, అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకుంటానని తాను ఊహించలేదని, దీనిని దైవదత్తంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

జీవితంపై తత్వం

జీవితం తాత్కాలికమని, మనిషి మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోవడమే ముఖ్యమని విజయశాంతి చెప్పారు. ఇతరులకు సహాయం చేయడం, కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. “పది మందికి అన్నం పెట్టగలగాలి” అనే సందేశాన్ని కూడా ఇచ్చారు.

రాజకీయాల్లోకి ఎందుకు?

రాజకీయాల్లోకి తన ప్రవేశానికి బలమైన నేపథ్యం ఉందని విజయశాంతి వివరించారు. నిజాం పాలనలో రజాకారుల దాడుల కారణంగా తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నదని, తన తల్లి చెప్పిన ఆ అనుభవాలు తనలో సమాజ సేవపై ఆసక్తిని పెంచాయని గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకునేందుకు తమ తాతగారు ఆస్తి మొత్తం వదిలి చెన్నైకి వలస వెళ్లాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఆ సంఘటనలే తనలో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని పెంచాయని పేర్కొన్నారు.

సేవలోనే ఆనందం

సామాజిక సేవ చేయడం తనకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందని, అయితే వాటిని ప్రచారం చేసుకోవడం తనకు నచ్చదని విజయశాంతి స్పష్టం చేశారు. పుట్టినరోజుల వంటి సందర్భాల్లో కూడా సేవా కార్యక్రమాలను ప్రదర్శనగా మార్చకూడదని భావిస్తానన్నారు. ఎదుటివారు సంతోషపడితే నాకు మరింత సంతోషం కలుగుతుంది అంటూ తన మనసులోని మాట‌ల‌ని బ‌య‌ట‌పెట్టారు.

Latest News