Vishnu Priya | నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే .. విష్ణుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్

Vishnu Priya | తెలుగు బుల్లితెరపై తన అందం, అల్లరి, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా ఎన్నో టీవీ షోలను హోస్ట్ చేసిన ఆమె.. నటిగా, డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Vishnu Priya | తెలుగు బుల్లితెరపై తన అందం, అల్లరి, గ్లామర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్‌గా ఎన్నో టీవీ షోలను హోస్ట్ చేసిన ఆమె.. నటిగా, డ్యాన్సర్‌గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

అయితే కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాల కారణంగానూ విష్ణుప్రియ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోషూట్లు, సబ్‌స్క్రిప్షన్ కంటెంట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వివాదాల కారణంగా ఆమె పేరు పలుమార్లు హాట్ టాపిక్‌గా మారింది.

మాజీ బాయ్‌ఫ్రెండ్స్ గురించి ఓపెన్‌గా..

ఇదిలా ఉండగా.. గతంలో విష్ణుప్రియ చేసిన రిలేషన్‌షిప్స్, బ్రేకప్స్‌కు సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆమె తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడారు.

“బ్రేకప్ అయిన తర్వాత కూడా మీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడుతారా?” అనే ప్రశ్నకు విష్ణుప్రియ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “నా ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ అందరితో నేను ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాను. వాళ్లంతా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లాంటివాళ్లే” అని చెప్పారు.

చచ్చే వ‌ర‌కు వాళ్ల‌ని ప్రేమిస్తూ ఉంటా..

అలాగే రిలేషన్‌లో ఉండటానికి మంచి కారణాలే ఉన్నాయని, కొన్ని పరిస్థితుల వల్ల మాత్రమే విడిపోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. వాళ్లలో కొన్ని విషయాలు నచ్చడం వల్లే రిలేషన్‌లో ఉన్నాను. బ్రేకప్ అయ్యిందంటే అంతా ముగిసిపోయిందని కాదు. భవిష్యత్తులో మళ్లీ రిలేషన్ పెట్టుకోవడం కుదరకపోవచ్చు.. కానీ ఫ్రెండ్‌షిప్ మాత్రం కొనసాగుతుంది అని విష్ణుప్రియ పేర్కొన్నారు.

చచ్చే వరకు వాళ్లని ప్రేమిస్తూనే ఉంటాను. మేము రిలేషన్‌లో ఉండటానికి ఎన్నో మంచి కారణాలు ఉన్నాయి. కేవలం కొన్ని కారణాల వల్ల మాత్రమే విడిపోయాం. విడిపోయినంత మాత్రాన ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

విష్ణుప్రియ ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటుండగా.. మరికొందరు రిలేషన్‌షిప్స్‌పై ఆమె అభిప్రాయాలను చర్చిస్తున్నారు. ఏదేమైనా.. వ్యక్తిగత విషయాలపై ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్‌గా మాట్లాడే సెలబ్రిటీల్లో విష్ణుప్రియ ఒకరిగా మరోసారి నిరూపించుకున్నారు.

ఇక కెరీర్ పరంగా చూస్తే.. యాంకర్‌గా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లు, డ్యాన్స్ రీల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Latest News