Toxic | యశ్ ‘టాక్సిక్’ గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు.. హాలీవుడ్ స్థాయిలో టేకింగ్, వైల్డ్ యాక్షన్

Toxic | కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను అందుకున్న రాకింగ్ స్టార్ యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టాక్సిక్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మలయాళీ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.

  • By: sn |    movies |    Published on : Jan 08, 2026 11:00 AM IST
Toxic | యశ్ ‘టాక్సిక్’ గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు.. హాలీవుడ్ స్థాయిలో టేకింగ్, వైల్డ్ యాక్షన్

Toxic | కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్‌ను అందుకున్న రాకింగ్ స్టార్ యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టాక్సిక్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మలయాళీ నటి–దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సినిమాను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ తెరకెక్కించడం విశేషం. యశ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టాక్సిక్ గ్లింప్స్ సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. విడుదలైన వీడియో పూర్తిగా హాలీవుడ్ సినిమాల టోన్‌లో ఉండటం, డైలాగ్స్ ఇంగ్లీష్‌లోనే వినిపించడం గమనార్హం. విజువల్స్, కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా ఉండటంతో ఈ సినిమా ఇండియన్ బౌండరీలను దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తుందన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

గ్లింప్స్‌లో యశ్‌ను పూర్తిగా డిఫరెంట్ అవతార్‌లో చూపించారు. వైల్డ్ రొమాన్స్, రా యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్ కలగలిపిన పాత్రలో యశ్ కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని బలమైన క్యాస్టింగ్ చేయడం సినిమాకు మరో ప్లస్‌గా మారింది. మహిళా పాత్రలకు కూడా కథలో ముఖ్యమైన ప్రాధాన్యం ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

టాక్సిక్ సినిమాను 2026 మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ మార్కెట్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం యశ్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమాల గ్లోబల్ జర్నీలో కూడా ఒక కీలక మైలురాయిగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ తీసుకున్న ఈ బోల్డ్ స్టెప్, గీతూ మోహన్‌దాస్ ప్రత్యేకమైన దర్శకత్వ శైలి, కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ నిర్మాణ విలువలు కలిసివస్తే టాక్సిక్ ఇండియన్ సినిమాను మరో కొత్త స్థాయికి తీసుకెళ్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.