OTT Fight | ప్రపంచ ఓటీటీ రంగంలో పెరుగుతున్న హీట్ .. నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి ఛాలెంజ్‌గా జియో హాట్‌స్టార్!

OTT Fight |డిజిటల్ వినోద ప్రపంచం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు టీవీ ఛానళ్లకే పరిమితమైన ప్రేక్షకులు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అలవాటు పడిపోయారు. ఈ మార్పుతో గ్లోబల్‌గా స్ట్రీమింగ్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రపంచంలో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

  • By: sn |    ott |    Published on : Jan 25, 2026 11:45 AM IST
OTT Fight | ప్రపంచ ఓటీటీ రంగంలో పెరుగుతున్న హీట్ .. నెట్‌ఫ్లిక్స్‌కు గట్టి ఛాలెంజ్‌గా జియో హాట్‌స్టార్!

OTT Fight |డిజిటల్ వినోద ప్రపంచం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు టీవీ ఛానళ్లకే పరిమితమైన ప్రేక్షకులు, ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల ద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అలవాటు పడిపోయారు. ఈ మార్పుతో గ్లోబల్‌గా స్ట్రీమింగ్ సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రపంచంలో ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజా డిజిటల్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ ప్రపంచంలో నంబర్ వన్ స్ట్రీమింగ్ సర్వీస్‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు దాదాపు 302 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. హాలీవుడ్, అంతర్జాతీయ కంటెంట్‌తో పాటు భారతీయ రీజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లపై నెట్‌ఫ్లిక్స్ పెట్టిన ప్రత్యేక దృష్టే ఈ స్థాయి ఆధిపత్యానికి ప్రధాన కారణంగా మారింది.

అయితే ఈ ఆధిపత్యానికి ఇప్పుడు భారతీయ ఓటీటీ దిగ్గజం నుంచి గట్టి సవాల్ ఎదురవుతోంది. డిస్నీ+ హాట్‌స్టార్, జియో విలీనం తర్వాత ఏర్పడిన ‘జియో హాట్‌స్టార్’ కేవలం 300 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో రెండో స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌కు కేవలం రెండు మిలియన్ల తేడాతోనే ఉండటం విశేషంగా మారింది. భారతదేశం వంటి భారీ జనాభా ఉన్న మార్కెట్‌లో తక్కువ ధరల ప్లాన్స్, క్రికెట్ స్ట్రీమింగ్ హక్కులు, ముఖ్యంగా ఐపీఎల్ వంటి మెగా స్పోర్ట్స్ ఈవెంట్లు జియో హాట్‌స్టార్‌కు భారీగా కలిసి వచ్చాయి.

ఈ రేసులో అమెజాన్ ప్రైమ్ వీడియో 200 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. వినోదంతో పాటు షాపింగ్, డెలివరీ, ఇతర ప్రయోజనాలు కలిపిన ప్రైమ్ మెంబర్‌షిప్ మోడల్ వల్ల అమెజాన్‌కు స్థిరమైన యూజర్ బేస్ ఏర్పడింది. నాలుగు, ఐదు స్థానాల్లో హెచ్‌బీఓ మాక్స్, డిస్నీ+ ఉన్నాయి. గ్లోబల్ స్థాయిలో సబ్‌స్క్రైబర్లను నిలుపుకోవడానికి డిస్నీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.ఇవే కాకుండా చైనాకు చెందిన టెన్సెంట్ వీడియో, ఐక్యూయీ (iQiyi) వంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వంద మిలియన్లకు పైగా యూజర్లతో టాప్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో పాపులర్ అయిన పారామౌంట్+, హులు, పీకాక్ వంటి ప్లాట్‌ఫామ్స్ కూడా ఈ పోటీలో తమ వాటాను నిలబెట్టుకుంటున్నాయి.

మొత్తానికి ఓటీటీ రంగంలో పెరుగుతున్న ఈ పోటీ ప్రేక్షకులకు మాత్రం లాభంగా మారుతోంది. విభిన్న భాషల్లో, విభిన్న జానర్లలో కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ క్వాలిటీ కంటెంట్‌తో ముందంజలో ఉంటే, జియో హాట్‌స్టార్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ నంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా చేరింది. రాబోయే రోజుల్లో ఈ ర్యాంకింగ్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.

​ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 స్ట్రీమింగ్ సర్వీసులు (సబ్‌స్క్రైబర్ల సంఖ్య):​

నెట్‌ఫ్లిక్స్: 302 మిలియన్లు​

జియో హాట్‌స్టార్: 300 మిలియన్లు​

అమెజాన్ ప్రైమ్: 200 మిలియన్లు​

హెచ్‌బీఓ మాక్స్: 128 మిలియన్లు

​డిస్నీ+: 127 మిలియన్లు

​టెన్సెంట్ వీడియో: 117 మిలియన్లు

​iQiyi: 101 మిలియన్లు

​పారామౌంట్+: 77 మిలియన్లు​

హులు: 55 మిలియన్లు​

పీకాక్: 41 మిలియన్లు