Pawan Kalyan| పిక్చర్ పర్‌ఫెక్ట్.. భార్య పిల్లలతో కలసి పవన్ కళ్యాణ్ గ్రూప్ ఫొటో
Pawan Kalyan| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గంలో పోటి చేసి 70 వేల మెజారిటీతో గెలుపొందారు. ఆయన డిప్యూటీ సీఎంగా రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ నటించాల్సిన కొన్ని సినిమాలు పెం
Pawan Kalyan| జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గంలో పోటి చేసి 70 వేల మెజారిటీతో గెలుపొందారు. ఆయన డిప్యూటీ సీఎంగా రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలతో బిజీగా గడుపుతున్నాడు. పవన్ కళ్యాణ్ నటించాల్సిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉండగా, వాటిని ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం పూర్తి రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నాడు. అయితే ఈ నెల 12న ఏపీ ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమనికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రజనీకాంత్, చిరంజీవి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుక ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసానికి బయలుదేరాడు. మధ్యలో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడడంతో చేసేదేం లేక రోడ్డు పక్కన కాసేపు వాహనాన్ని ఆపి ఫ్యామిలీతో సరదాగా గడిపారు.తన భార్య అనా కొణిదెల, కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యలతో కలిసి గ్రూప్ పొటో కూడా దిగారు. ఇలాంటి రేర్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి పవన్ ఇలా ఫొటోలు దిగడం చాలా అరుదు. అలాంటిది రేణూ, పవన్ పిల్లలైన ఆద్య, అకీరాతో కలిసి పవన్ ఇంత ఆప్యాయంగా పిక్ దిగడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ నలుగురు కలిసి కెమెరాకి పోజులిచ్చింది. పవన్ ఫ్యామిలీ పిక్ ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది. పవన్ ఇలా తన ఫ్యామిలీతో ఫోటోలు దిగడం చాలా అరుదు. దీంతో ఈ లేటెస్ట్ ఫోటో ఎంతో అందంగా ఉంది. ఫ్యాన్స్ ని అలరించేలా ఉంది. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పిక్‌ని జనసేన పార్టీ తమ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే – ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది అని రాసుకొచ్చారు.
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి అకీరా తన తండ్రితోనే ఉన్నాడు. చంద్రబాబుని కలిసినప్పుడు, అలాగే ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా అకీరా నందన్ ఉన్నాడు. వాటికి సంబంధించిన ఫొటోలని రేణూ దేశాయ్ షేర్ చేస్తూ ఫుల్ ఖుషీ అయింది. అయితే అకీరాని పవన్ తన వెంట తిప్పుకుంటున్నాడంటే రానున్న రోజులలో ఆయన సినిమాలలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఎలివేట్ చేస్తున్నాడని అందరు మాట్లాడుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram