Pawan Kalyan| ఇద్దరు కుమారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్..ఫోటో వైరల్

Pawan Kalyan| ఇద్దరు కుమారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్..ఫోటో వైరల్

విధాత,హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా ఫోటో వైరల్ గా మారింది. తన ఇద్దరు కుమారులు అకిరా నందన్, మార్క్ శంకర్ పవనోవిచ్ లతో ఉన్న ఫోటో ఆయన అభిమానులను, జనసేన శ్రేణులను ఆకట్టుకుంది. రేణుదేశాయ్-పవన్ ల సంతానం అకిరానందన్, ఆధ్యాలు. అన్నా లెజినోవా-పవన్ ల సంతానం పొలెనా అంజనా పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్. ఇటీవల సింగపూర్ లో ఓ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన తర్వాతా మార్క్ శంకర్ పవనోవిచ్ కనిపించిన తొలి ఫోటో ఇదే కావడంతో పవన్ అభిమానులు అంతా ఆసక్తిగా ఆ ఫోటోను వైరల్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ నగరశివారులోని పటాన్ చెరు సమీపంలో ఇక్రిశాట్ క్యాంపస్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్‌ ఆఫ్ హైదరాబాద్‌లో మార్క్ శంకర్ పవనోవిచ్‌కి అడ్మిషన్ తీసుకున్నారు. ఇకపై కొడుకు సంరక్షణని దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశంతోనే పవన్ ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు.

అనేక ప్రత్యేకతలు ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్‌లోనే మహేష్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ పిల్లలు అయన్, అర్హా చదువుతున్నారు. ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పిల్లలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 దేశాల విద్యార్థులు చదువుతుండటం విశేషం.  పవన్ కల్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమా జూలై 24న విడుదలవుతుండగా..తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్ అభిమానులను ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాలు పెంచేశాయి.