Singer Mangli : అసభ్య కామెంట్స్ పై సింగర్ మంగ్లీ ఫిర్యాదు
ప్రముఖ సింగర్ మంగ్లీ తన కొత్త పాట ‘బాయిలోనే బల్లి పలికే’ పై, అలాగే ఎస్టీ వర్గాన్ని కించపరిచేలా అసభ్యకర కామెంట్స్ చేసిన ఒక వ్యక్తిపై ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విధాత, హైదరాబాద్ : తన పాటను కించపరుస్తూ ఓ వ్యక్తి అసభ్యకర కామెంట్స్ చేశాడంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మంగ్లీ ‘బాయిలోనే బల్లి పలికే’ పాటను విడుదల చేసింది. ఈ పాటనే కాకుండా ఎస్టీ వర్గాన్ని కించపరిచేలా నీచంగా కామెంట్స్ చేశారంటూ మంగ్లీ ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
అయితే మంగ్లీ, నాగవ్వలు ఆలపించిన ‘బాయిలోనే బల్లి పలికే’ పాట నెట్టింటా దూసుకపోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ వచ్చేశాయి. కమల్ ఎస్లావత్ సాహిత్యానికి సురేష్ బోబ్బిలి సంగీతం..మంగ్లీ స్వరంతో పాటు వేసిన స్టెప్పులు హుషారుగా ఉండటంతో ఈ పాట మిలయన్ల వ్యూస్ దిశగా సాగుతుంది. ఈ క్రమంలో పాటను, మంగ్లీని కించపరుస్తూ ఓ వ్యక్తి కామెంట్స్ చేయడం..దీనిపై మంగ్లీ ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram