Pawan Kalyan| పవన్ కళ్యాణ్ గెలుపుతో త్రివిక్రమ్ షాకింగ్ నిర్ణయం.. ఎవ్వరు ఊహించి ఉండరు..!
Pawan Kalyan| మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న పవన్ రాజకీయాల వలన మధ్యలో కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్నాడు.
Pawan Kalyan| మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్నాడు పవన్ కళ్యాణ్. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న పవన్ రాజకీయాల వలన మధ్యలో కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉన్నాడు. వకీల్ సాబ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీని సొంతం చేసుకున్న పవన్ కల్యాణ్.. దాని తర్వాత ‘భీమ్లా నాయక్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి అదిరిపోయే స్పందన రావడంతో బ్రో అనే చిత్రం చేశాడు. ఇందులో తేజ్, పవన్ కలిసి నటించి అలరించారు. ఇక ఇప్పుడు ఆయన చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండగా, వాటిని త్వరలో పూర్తి చేసే పనిలో పవన్ ఉన్నాడు.

అయితే పవన్ ఇప్పుడు రాజకీయాలలో కూడా ఉండగా, ఆయన పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. అంతేకాకుండా ఆయన పార్టీ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు గెలిచి సంచలనం సృష్టించింది. ఇండియాలో ఇంతవరకు వందకి వందశాతం రిజల్ట్ ఎప్పుడు రాలేదు. పవన్ కి ఇంత మంచి విజయం దక్కడం పట్ల ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్‌కి ఇండస్ట్రీలో మంచి స్నేహితుడిగా ఉండే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయాలనే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలవడానికి పరోక్షంగా త్రివిక్రమ్ కూడా కారణమయ్యాడు అనే విషయం అందరికి పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో త్వరలోనే పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఒక సినిమా తెరకెక్కించే విధంగా కథను రాసుకుంటున్నారట త్రివిక్రమ్.
పవన్ కళ్యాణ్‌కి సినిమాలు ఇష్టం లేకపోయిన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు, సినిమాలలో ఎలా నటించాడు, ఆయనను బాధ పెట్టిన వ్యక్తులు ఎవరు..? ఓడిపోయిన సంధర్భంలో ఆయన ఏం చేశాడు..? పొలిటికల్ పరంగా ఎలా ముందుకు వెళ్లారు ..? ఆయనను తొక్కేయడానికి చూసింది ఎవరు..? అన్న విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తారా ..? వేరే హీరో నటిస్తారా..? అన్నది ఇంకా క్లారిటీ లేదు . ప్రస్తుతానికి ఈ వార్త మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. పవన్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు మంచి హిట్ కొట్టగా, ఇప్పుడు ఈ మూవీ కూడా అతి పెద్ద విజయం సాధిస్తుందని అంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram