Faria Abdullah | జాతిరత్నం ఫరియా.. మంచంపై పొర్లాడుతుంది.. అందుకేనా?
Faria Abdullah విధాత: చిట్టీ.. ఈ పేరు జాతిరత్నాలు సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలోనే కాదు మామూలుగా కూడా ఆడపిల్లల్ని చిట్టీ అని పిలవడం కామన్ అయిపోయింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లో హిట్ హీరోయిన్‌గా మూవీల్లోకి అడుగుపెట్టిన ఈ ఆరడుగుల హీరోయిన్, ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ అందుకోలేక పోయింది. బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేసినా కూడా లాభం లేకపోయింది. దీంతో.. పెద్దగా సినిమా ఆఫర్స్ లేక సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోసే […]

Faria Abdullah
విధాత: చిట్టీ.. ఈ పేరు జాతిరత్నాలు సినిమా తర్వాత సినీ ఇండస్ట్రీలోనే కాదు మామూలుగా కూడా ఆడపిల్లల్ని చిట్టీ అని పిలవడం కామన్ అయిపోయింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్‌లో హిట్ హీరోయిన్‌గా మూవీల్లోకి అడుగుపెట్టిన ఈ ఆరడుగుల హీరోయిన్, ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ అందుకోలేక పోయింది. బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేసినా కూడా లాభం లేకపోయింది. దీంతో.. పెద్దగా సినిమా ఆఫర్స్ లేక సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోసే ఖాతాలో చేరిన హీరోయిన్లలో ఫరియా కూడా చేరిపోయింది.
తన హాట్ లుక్స్‌తో, మాంచి డాన్స్ ఫెర్ఫామెన్స్‌తో వీడియోలు పెడుతూ అటు కుర్రకారుకు, ఇటు ఇండస్ట్ర్రీ జనాలకు మతిపోగొట్టే పనిలో పడింది ఫరియా. తాజాగా తన బెడ్ పై రొమాంటిక్ లుక్‌లో పడుకుని ఫోజిచ్చిన వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె ఇచ్చిన ఫోజులు చూస్తుంటే.. విరహ వేదనని తను అనుభవిస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మంచి నటనతో ప్రేక్షకులను కట్టి పడేయగలిగే నైపుణ్యం ఉండి కూడా.. సరైన ఆఫర్స్ లేక కాస్త వెనకపడిందనే చెప్పాలి. ఇప్పటి హీరోయిన్లలా మేకర్స్ అంచనాలకు తగినట్టుగా వాళ్ల దృష్టిలో పడే టాలెండ్ విషయంలో ఫరియా వెనకపడే ఉంది.
ఆమెకు చిన్న చిన్న పాత్రలలో అవకాశాలు వస్తున్నాయి తప్ప.. హీరోయిన్‌గా నిరూపించుకునే మంచి ఛాన్స్ మాత్రం ఆమెకు రావడం లేదు. అందుకు కారణం.. ఆమెకు హిట్టు ఇచ్చిన ‘జాతిరత్నాలు’ కూడా కారణంగా చెప్పుకోవచ్చు. అందులో ఆమెని చూసిన వారంతా.. కామెడీ క్యారెక్టర్‌గా మాత్రమే ఆమెని చూస్తున్నారా అనేలా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమధ్య చేసిన ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్ర్కైబ్’ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇక రవితేజతో చేసిన ‘రావణాసుర’ మూవీలో కూడా ఫరియా నటించింది కానీ, ఏం ఖర్మో అదీ డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు సుధీర్ వర్మ కథను ప్రెజంట్ చేసిన విధానంలో లోపాలతో సినిమా ప్రేక్షకులకు అందగా నచ్చలేదు.
ఫరియా చెప్పే ముద్దు ముద్దు తెలంగాణ యాసతో చెప్పే డైలాగ్స్, పొగుడు సుందరి డాన్స్ స్టెప్పులు, అప్పుడప్పుడూ చేసే సోషల్ మీడియా వీడియోలతో సంపాదించుకున్న క్రేజ్ ఊరికే పోకుండా ఫరియాకు లక్కీగా ఒక సినిమా పడితే చాలు.. ఇండస్ట్రీని ఊపేయగలిగే సత్తా ఆమెకు ఉందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూద్దాం త్వరలో ఫరియా ఖాతాలో బంపర్ హిట్ పడనుందేమో..! అన్నట్లు ప్రస్తుతం తమిళ్‌లో ఓ బంపరాఫర్ ఫరియాను వరించినట్లుగా తెలుస్తోంది.