Trivikram Srinivas | యవ్వారాలు తలకి చుట్టుకుంటే అంతే.. తగిలించుకున్నాక తప్పదు మరి!

Trivikram Srinivas | అతగాడు డైలాగ్స్ రాశాడంటే టపాకాయల్లా పేలతాయి, సినిమా తీశాడంటే సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టే.. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇలా ఎందుకు చేస్తున్నాడంటూ, కొంతకాలంగా చెప్పుకుంటున్నారు సినీ జనాలు. ఇక సోషల్ మీడియాలో అయితే ఇంత లేటు వయసులో ఇదేం బుద్దంటూ, హీరోయిన్స్‌ని బుట్టలో వేసుకుని వాళ్ళను చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆ దర్శకుడి గురించి చెవులు గొణుక్కుంటున్నారు నెటిజన్లు. విషయంలోకి వెళితే దర్శక దిగ్గజంగా, గురువుగా చెప్పుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమధ్య సినిమాలకన్నా, […]

  • Publish Date - July 19, 2023 / 09:05 AM IST

Trivikram Srinivas |

అతగాడు డైలాగ్స్ రాశాడంటే టపాకాయల్లా పేలతాయి, సినిమా తీశాడంటే సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టే.. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇలా ఎందుకు చేస్తున్నాడంటూ, కొంతకాలంగా చెప్పుకుంటున్నారు సినీ జనాలు. ఇక సోషల్ మీడియాలో అయితే ఇంత లేటు వయసులో ఇదేం బుద్దంటూ, హీరోయిన్స్‌ని బుట్టలో వేసుకుని వాళ్ళను చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆ దర్శకుడి గురించి చెవులు గొణుక్కుంటున్నారు నెటిజన్లు. విషయంలోకి వెళితే దర్శక దిగ్గజంగా, గురువుగా చెప్పుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమధ్య సినిమాలకన్నా, లవ్ ట్రాక్స్ మీదనే దృష్టి ఎక్కువ పెట్టిననట్టు కామెంట్స్ చాలానే వినిపిస్తున్నాయి.

విరూపాక్ష హీరోయిన్ సంయుక్తతో త్రివిక్రమ్ క్లోజ్‌గా ఉంటున్నాడని, తనకి వరుసగా ఛాన్స్‌లు ఇప్పించి స్టార్ హీరోయిన్‌ని చేయాలని ప్రయత్నిస్తున్నాడనేలా కామెంట్స్ ఎక్కువ కావడంతో హర్ట్ అయిన సంయుక్త.. ఇద్దరి మధ్య ఏదో ఉందనే మాటలకు చెక్ పెట్టేందుకు త్వరలో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా నుంచి తప్పుకుంది. ఇలా అయినా తన మీద వస్తున్న రూమర్స్ ఆగుతాయని ఈ పని చేసిందట సంయుక్త.

ఇప్పుడిదే కోవలోకి వస్తుంది నటి పూజా హెగ్డే కూడా.. తాజాగా పూజా విషయంలోనూ త్రివిక్రమ్ ఇలాంటి తతంగమే నడుపుతున్నాడని కాస్త గట్టిగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ఒక లైలా కోసం’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపుతెచ్చుకుంది పూజా హెగ్డే.

ఆ సినిమా తర్వాత ‘ముకుంద’ చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, మంచి అవకాశాలనే దక్కించుకుంది. అటు బాలీవుడ్‌కి వెళ్ళి హీరో హృతిక్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. కాస్త గ్యాప్ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్’ మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబడింది.

బుట్టబొమ్మగా అందరికీ పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకున్న పూజా.. సౌత్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఈ విజయాలన్నీ బాగానే ఉన్నాయి కానీ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో గత కొన్నేళ్ళుగా ప్రేమాయణం నడుపుతుందనే రూమర్స్ అయితే ఘాటుగానే వినిపిస్తున్నాయి.

ఈ కారణంగానే త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ నుంచి పూజాను తప్పించారని, ఇది మహేష్ తీసుకున్న నిర్ణయమే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ విషయాన్ని చాలా అవమానంగా భావించిన పూజా బాగా హర్ట్ అయిందట.

ఆమెను బుజ్జగించే ప్రయత్నంలో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య నిర్మాణ సంస్థ అయిన ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నాడట త్రివిక్రమ్.

ఇక పూజ పరిస్థితి కూడా ఏ ఆఫర్స్ లేకుండా ఖాళీగానే ఉండటంతో, తప్పక ఈ ఆఫర్‌ని ఒప్పుకుందని అంటున్నారు. ప్రస్తుతం ఏదో ఒకటి.. బండి లాగించేయడమే అన్నట్లుగా పూజా పరిస్థితి మారిపోయింది మరి. అది విషయం.

Latest News