ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టే సినిమాలు ఇవేనా?

  • By: sn |    breaking |    Published on : Jan 07, 2024 12:43 PM IST
ఈ ఏడాది సంక్రాంతికి హిట్ కొట్టే సినిమాలు ఇవేనా?

సంక్రాంతికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌డా సినిమాలు విడుద‌ల అవుతూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి వ‌చ్చింది అంటే సినీ ప్రియుల‌కి పెద్ద పండ‌గే అని చెప్పాలి. సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల‌న్నీ కూడా దాదాపు మంచి విజ‌యాలు సాధిస్తూ కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌గా, ఇందులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గుంటూరు కారం, హ‌నుమాన్‌పై అంద‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యాలు సాధించాయి.మూడు సినిమాల‌లో బిగ్గెస్ట్ హిట్‌గా చిరంజీవి- బాబి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన వాల్తేరు వీర‌య్య నిలిచింది. ఇక 2022 సంక్రాంతికి చూస్తే.. బంగార్రాజుబ బ‌డా హిట్ గా నిలిచింది.2021 సంక్రాంతి సినిమాల్లో క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.2020లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద హిట్ అయ్యాయి. ఇక 2019లో వెంకీ-వ‌రుణ్ తేజ్ కాంబోలో వ‌చ్చిన‌ ఎఫ్2 మంచి విజ‌యాలు సాధించాయి.

గ‌త 25 ఏళ్ల‌లో సంక్రాంతికి వ‌చ్చి హిట్టైన సినిమాలేంటి..ఈ ఏడాది హిట్ కాబోయేవి ఏంటి?ఇక 2018లో జై సింహా, 2017లో ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానం భవతి హిట్లుగా నిలిచాయి.2016లో నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్నినాయన సినిమాలు విడుదలై పెద్ద హిట్స్ అందుకున్నాయి. ఇక 2015లో గోపాల గోపాల, 2014లో ఎవడు, 2013లో నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2012లో బిజినెస్ మేన్, 2011లో మిరపకాయ్, 2010లో అదుర్స్, 2009లో అరుంధతి సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌య దుందుభి మోగించాయి. ఇక 2008లో కృష్ణ, 2007లో దేశముదురు, 2006లో లక్ష్మీ, 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, 2004లో వర్షం, లక్ష్మీనరసింహ, 2003లో ఒక్కడు, 2002లో నువ్వులేక నేనులేను, 2001లో నరసింహ నాయుడు సంక్రాంతి కానుకగా రిలీజై సక్సెస్ అయ్యాయి.2000 సంవత్సరంలో అన్నయ్య, కలిసుందాంరా 1999 సంవత్సరంలో సమరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై అతి పెద్ద హిట్స్‌గా నిలిచాయి.