Health tips : సమాజంలో చాలామంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, తింటున్న ఆహారం కారణంగా బరువు అమాంతం పెరుగుతున్నారు. అస్సలే శారీరక శ్రమ లేకపోవడం కూడా ఇలా పెరగడానికి కారణమవుతోంది. లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం లాంటి వాటితో ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Health tips : సమాజంలో చాలామంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, తింటున్న ఆహారం కారణంగా బరువు అమాంతం పెరుగుతున్నారు. అస్సలే శారీరక శ్రమ లేకపోవడం కూడా ఇలా పెరగడానికి కారణమవుతోంది. లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం లాంటి వాటితో ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఈ కింది పది టిప్స్‌ను ఫాలో అయితే సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడటమేగాక కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. అందువల్ల మనం తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నీరు శరీరమంతా పోషకాలను బదిలీ చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల శరీరంలోని విషపదార్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఇవి మీ కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి. అధిక ప్రొటోన్లు కలిగిన ఆహారం మిమ్మల్ని అతిగా తినకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రొటీన్ ఫుడ్ కండరాల పెరుగుదలకు చక్కటి సహాకారం అందిస్తుంది. జీవక్రియను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
మీరు తినే ప్రతి పదార్థంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఇష్టమైన ఫుడ్‌ను ఆస్వాదించడం తప్పులేదు. కానీ అతిగా తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆకలితో ఉన్నపుడు ఎలాంటి ఫుడ్ తినాలనే విషయంలో అవగాహన పెంచుకోవాలి. అలా చేయడంవల్ల అతిగా తినకుండా జాగ్రత్తపడవచ్చు.
సరైన నిద్ర లేకపోవడంవల్ల హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. ప్రతిరోజు సంపూర్ణమైన నిద్ర ఆరోగ్యంగా ఉంచడంతోపాటు సులభంగా బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. వాటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉండవు. అధికంగా చక్కెరలు ఉంటాయి. దాంతో బరువు పెరగటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బరువు తగ్గించుకోవడానికి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంవల్ల మన శరీరానికి కావాల్సిన కేలరీలు అందుతాయి. వ్యాయామం జీవక్రియను, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్‌ను తగ్గించునేందుకు నడక, యోగా, ఆటలు తోడ్పడుతాయి.
ఆకలి బాగా ఉన్నప్పుడు అధిక పోషకాలున్న స్నాక్స్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, గింజలు లాంటి స్నాక్స్‌ను ఎంచుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారాలు, జూస్లు తదితర విషయాల గురించిన సలహాల కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగించాలి. అందువల్ల ఆహారపు అలవాట్లపై అవగాహన పెరుగుతుంది. శారీరక ఎదుగుదల కోసం మంచి ఫుడ్ ను ఎంచుకునేందుకు సాయపడుతుంది. బరువు తగ్గడానికి బాడీకి కావాల్సిన కేలరీలను అందించడంలో ఫుడ్ యాప్స్ మేలు చేస్తాయి.
మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు తినే ముందు చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ప్రతి పూటకు కొలతలు పెట్టుకోవాలి. ఇలా చేయడంవల్ల అధిక బరువును సులభంగా నియంత్రించవచ్చు.
దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్స్, ఆకలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒత్తిడి అనిపించినప్పుడు ధ్యానం, యోగా, వ్యాయామం లేదంటే ఏదైనా మీకిష్టమైన పని మీదకు మీ మనసును మళ్లించండి.