సన్‌డే హో యా మన్‌డే.. రోజ్ ఖావ్ అండే.. అంటూ కోడిగుడ్లు తినడాన్ని ప్రోత్సహించే ప్రకటనలు చూస్తూ ఉంటాం. అసలు కోడిగుడ్డు మంచిదా? కాదా? అన్న చర్చ చాలా కాలం నుంచే ఉన్నది. పసుపు సొన కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని, తెల్లని భాగం ప్రొటీన్స్ కలిగి ఉంటుందనే కొన్ని వాదనలు ఉన్నాయి. హార్ట్ పేషెంట్స్ పసుపు సొన తినొచ్చా? తినకూడదా? అన్న విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో వాదనగా ఉంది. ఇదే సమయంలో మన జీవనశైలి నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై శ్రద్ధ కూడా పెరుగుతూ ఉంది. ఒత్తిడి జీవితాలు అనుభవిస్తున్న అనేక మంది యువకులు సైతం గుండెపోట్లకు గురై చనిపోతున్న విషాద దృశ్యాలు సైతం మన సమీప వ్యక్తుల్లోనే కొందరికి తారసపడి ఉండొచ్చు కూడా. వాటి ప్రభావంతో కూడా ఆరోగ్యవంతమైన మార్గాన్ని అనుసరించేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
మన రోజువారీ ఆహారంలో ఏమేం ఉండాలో వేర్వేరు డాక్టర్లు వేర్వేరు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఫిజీషియన్స్ కమిటీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న డాక్టర్ స్టీవెన్ లోమ్.. మన భోజనం ప్లేటులో ఉండకూడని మూడు ముఖ్యమైన ఆహార పదార్థాలను తెలియజేశారు. అందులో గుడ్డు కూడా ఒకటి. ‘ఎగ్స్ అనేవి కొలెస్ట్రాల్ బాంబులని అనడం కొందరి నుంచి నేను విన్నాను. పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. ఆఫ్రికా డైట్‌లో డైటరీ కొలెస్ట్రాల్ సోర్స్‌లో గుడ్లు నంబర్ 1 అని అనేక సర్వేలు చెబుతున్నాయి’ అని డాక్టర్ లోమ్ చెప్పారు. ఇక ఆయన చెప్పిన మిగిలిన రెండు ఆహారాలు.. ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్, రెండోది రెడ్‌మీట్. ఈ రెండింటిలో శాచురేటెడ్ ఫ్యాట్ అధిక స్థాయిలో ఉంటుందని తెలిపారు. మొత్తంగా మూడింటినీ భోజనం ప్లేట్ నుంచి దూరం పెడితే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు.
ఏంటీ కొలెస్ట్రాల్?
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కొవ్వు తరహా పదార్థం అని మయో క్లినిక్ పేర్కొంటున్నది. ఆరోగ్యకరమైన కణజాల నిర్మాణం కోసం శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే.. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే హృదయ సంబంధమైన రోగాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హెచ్‌డీఎల్. దీనిని మంచి కొలెస్ట్రాల్ అంటారు. ఎల్‌డీఎల్ అనేది మరొకటి. దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. దీన్నలా ఉంచితే.. ఆరోగ్యం విషయంలో గుడ్ల ప్రభావం ఎంత అనేది ఆసక్తికరమైన చర్చలకు, అధ్యయనాలకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి..
Maoists | కర్రెగుట్టల నుంచి మకాం మార్చిన మావోయిస్టులు! ఆపరేషన్‌లో కీలక మలుపు..
Machilipatnam | మచిలీపట్నం.. అదేనండీ.. బందర్‌కు ఆ పేరెలా వచ్చింది?మీకు తెలుసా
KCR | అదే మాట.. అదే పాట..కేసీఆర్ బాట! ఆత్మస్తుతి పరనింద తీరు మారేనా?: పార్ట్ 1