Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. వెంటనే రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోండి..!
Health tips | రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాల్లో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు. అయితే ఇది మహిళల్లో చాలా సర్వ సాధారణంగా వచ్చే సమస్య. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో దీన్ని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స పొందవచ్చు. మరి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

Health tips : రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణాల్లో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ సంభవించవచ్చు. అయితే ఇది మహిళల్లో చాలా సర్వ సాధారణంగా వచ్చే సమస్య. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో దీన్ని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా చికిత్స పొందవచ్చు. మరి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
రొమ్ములో గడ్డలు
రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాల్లో ఒకటి రొమ్ములో గడ్డల్లాగా అనిపించడం. ఈ గడ్డలు గట్టిగా లేదా మందంగా ఉంటాయి. నొప్పి ఉండదు. అయితే అన్ని రొమ్ము గడ్డలు క్యాన్సర్ కాదని గమనించాలి. కానీ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని వైద్యులు గడ్డలను పరీక్షించి చెప్తారు.
రొమ్ము చర్మంలో మార్పులు
రొమ్ము క్యాన్సర్ మరొక లక్షణం రొమ్ము చర్మంలో మార్పులు. రొమ్ము చర్మం ఎర్రబడటం, ముడతలు పడటం కనిపిస్తుంది. చర్మం మందంగా మారవచ్చు లేదా నారింజ తొక్క లాంటి ఆకృతిని పొందవచ్చు. మీరు మీ రొమ్ము చర్మంలో ఏవైనా మార్పులను గమనించినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
చను మొన
చను మొన రక్తసిక్తంగా లేదా గట్టిగా ఉంటే రొమ్ము క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. చాలా మంది మహిళలకు క్యాన్సర్ లేకపోయినా చనుమొనలు గట్టిగా ఉంటాయి. అయితే వైద్యులను సంప్రదిస్తే దానిపై స్పష్టత వస్తుంది.
రొమ్ము పరిమాణం
రొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు సంకేతం. ముఖ్యంగా అవి అసమానంగా ఉంటే రొమ్ము క్యాన్సర్ లక్షణం కావచ్చు. కాబట్టి రొమ్ము పరిమాణంలో, ఆకారంలో మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.
రొమ్ములో నొప్పి
రొమ్ము క్యాన్సర్ వస్తే సాధారణంగా నొప్పి ఉండదు. కానీ కొందరు మహిళలకు రొమ్ము భాగంలో లేదా చనుమొనల్లో నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పి స్థిరంగా లేదా అడపాదడపా ఉండవచ్చు. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తిస్తే నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.