Low BP | అధిక రక్తపోటు ఆరోగ్యానికి ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ, తక్కువ రక్తపోటు సైతం ఆరోగ్యానికి హానికరమే. రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే.. వారు లో బీపీతో బాధపడుతున్నట్లే. తక్కువ రక్తపోటును హైపోటెన్షన్‌గా పిలుస్తుంటారు. లో బీపీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే లో బీపీకి గల కారణాలు, దానికి ఎలా అడ్డుకట్ట వేయొచ్చో ఒకసారి తెలుసుకుందాం.. నీటిశాతం తక్కువ.. లో బీపీకి కారణం […]
Low BP | అధిక రక్తపోటు ఆరోగ్యానికి ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ, తక్కువ రక్తపోటు సైతం ఆరోగ్యానికి హానికరమే. రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే.. వారు లో బీపీతో బాధపడుతున్నట్లే. తక్కువ రక్తపోటును హైపోటెన్షన్‌గా పిలుస్తుంటారు. లో బీపీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అనేక సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అయితే లో బీపీకి గల కారణాలు, దానికి ఎలా అడ్డుకట్ట వేయొచ్చో ఒకసారి తెలుసుకుందాం..
లో బీపీకి కారణం శరీరంలో నీటిశాతం తగ్గడం కూడా ఒక కారణం. డీహైడ్రేషన్ కారణంగా రక్తం తగ్గిపోయి బీపీ తగ్గుతుంది. డీహైడ్రేషన్‌కు కొన్ని మందుల వాడకం, డయేరియా సైతం కారణాలని వైద్యులు పేర్కొంటున్నారు. లో బీపీతో బాధపడుతున్న వారు రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్ల నీటిని తాగడం అవసరమని నిపుణులు తెలుపుతున్నారు.
రక్తపోటు, గుండె మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. బీపీ తక్కువగా ఉండడానికి గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులు కారణం కావొచ్చు. రక్తనాళాల బలహీనత వల్ల బీపీ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ రక్తపోటును సైతం ప్రభావితం చేస్తుంది.
కొన్ని రకాల అలర్జీలతో బీపీ తక్కువగా ఉంటుంది. రక్తపోటు తరచుగా తక్కువగా ఉంటే.. అలెర్జీలు కారణం కావచ్చు. ఈ పరిస్థితుల్లో వైద్యుడుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకుంటే సమస్య మరింత ముదురుతుంది.
తక్కువ రక్తపోటు సమస్య ఉన్నప్పుడు ఉప్పు తీసుకోవాలి. ఉప్పు తీసుకోవడం ద్వారా రక్తపోటు పెరుగుతుంది. నీళ్లు తాగడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల కూడా రక్తపోటు సరిగ్గా ఉంటుంది. దీంతో పాటు లోబీపీ విషయంలో ఆహారం, పానీయాలపై శ్రద్ధ వహించడం వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.