కలవర పెడుతున్న కొత్త వ్యాధి.. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబియాతో వ్యక్తి మృతి

దక్షిణ కొరియాలో కేసు ముక్కు నుంచి శరీరంలోకి వెళి.. మెదడును తినేసే వ్యాధి! Brain-Eating Amoeba | కరోనా మహమ్మారితో వణుకుతున్న దక్షిణ కొరియాను మరోసారి కొత్త వ్యాధి కలవర పెడుతున్నది. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబియా కేసు నమోదైంది. దీన్ని న‌గ‌లేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి సోకి ఆ దేశంలో 50 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఆ వ్యాధి థాయ్‌లాండ్‌లో సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సదరు వ్యక్తి […]

  • By: krs    health    Dec 27, 2022 2:50 PM IST
కలవర పెడుతున్న కొత్త వ్యాధి.. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబియాతో వ్యక్తి మృతి
  • దక్షిణ కొరియాలో కేసు
  • ముక్కు నుంచి శరీరంలోకి వెళి.. మెదడును తినేసే వ్యాధి!

Brain-Eating Amoeba | కరోనా మహమ్మారితో వణుకుతున్న దక్షిణ కొరియాను మరోసారి కొత్త వ్యాధి కలవర పెడుతున్నది. బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబియా కేసు నమోదైంది. దీన్ని న‌గ‌లేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ వ్యాధి సోకి ఆ దేశంలో 50 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఆ వ్యాధి థాయ్‌లాండ్‌లో సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సదరు వ్యక్తి నాలుగు నెలల పాటు థాయ్‌లాండ్‌లో ఉండగా.. ఈ నెల 10న సౌత్‌ కొరియాకు చేరుకున్నాడు. అయితే, థాయ్‌లోనే అతనికి ఇన్ఫెక్షన్‌ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. న‌గ‌లేరియా ఓ సూక్ష్మజీవి. ఏక కణ జీవితి అయిన బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబియా సాధారణంగా నదులు, చెరువు, వాగుల్లో ఉంటుంది. అయితే, అన్నింటికీ ప్రాణాంతక శక్తి ఉండదు. కానీ, నగలేరియా ఫ్లవరీ మనుషులకు సోకుతుంది.

ముక్కు ద్వారా మ‌నిషి శ‌రీరంలోకి న‌గ‌లేరియా ప్రవేశించి, ఆ తర్వాత బ్రేయిన్‌కు చేరుకుంటుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత నరాలను దెబ్బతీస్తుంది. ప్రైమ‌రీ అమీబిక్ మెనింజో ఇన్‌సెఫిలైటిస్ అనే వ్యాధికి కార‌ణమవుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఇన్ఫెక్షన్‌ సోకుతుంది.

పీఏఎం సోకిన సమయంలో త‌ల ముందు భాగంలో తీవ్రంగా నొప్పి రావడంతో పాటు జ్వరం, వాంతులు, మెడపట్టేయడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. విషమిస్తే మానసిక సమస్యలకు దారి తీస్తుంది. 1962 నుంచి 2021 వరకు అగ్రరాజ్యం అమెరికాలో 154 వరకు కేసులు నమోదయ్యాయి.

పీఎంఏ బారిన పడ్డ వారిలో కేవలం నలుగురు మాత్రమే బతికినట్లు సీడీసీ పేర్కొంది. అయితే, మనుషుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం లేదు. ఈ వ్యాధి చికిత్స కోసం కొన్ని డ్రగ్స్‌ను వినియోగిస్తుంటారు. ఇదిలా ఉండగా.. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 381 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. అమెరికా, భారత్, చైనాలోనూ పీఎంఏ కేసులు నమోదయ్యాయి.