మాక్సివిజన్ ఆసుపత్రి ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్
హైదరాబాద్‌లోని కొంపల్లిలో మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ 13వ బ్రాంచిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ప్రారంభించారు.పెరుగుతున్న జనాభాకు ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ సేవలు అందించడమే ఈ కొత్త ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు

అక్టోబర్ 31, 2025 వరకు ఉచిత సంప్రదింపులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కొంపల్లిలో మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ 13వ బ్రాంచిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు ప్రారంభించారు.పెరుగుతున్న జనాభాకు ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ సేవలు అందించడమే ఈ కొత్త ఆసుపత్రి ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ఆసుపత్రిలో కంటిశుక్లం శస్త్రచికిత్స (రోబోటిక్ సహాయంతో సహా), లాసిక్, లేజర్ విజన్ కరెక్షన్. రెటీనా సేవలు, గ్లాకోమా చికిత్సతోపాటు పీడియాట్రిక్ ఆప్తాల్మాలజీ, కార్నియల్ ట్రాన్స్‌ప్లాంట్లు, ఆక్యులోప్లాస్టీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
NH 44, ఔటర్ రింగ్ రోడ్‌లకు దగ్గరగా ఉండటం వల్ల సుచిత్ర సర్కిల్, దూలపల్లి, బోలారం వంటి ప్రాంతాల వారికి సౌకర్యంగా ఉంటుందని, అక్టోబర్ 31, 2025 వరకు ఉచిత సంప్రదింపులు, ఆప్టికల్ ఉత్పత్తులు, శస్త్రచికిత్సలపై 15% తగ్గింపును మాక్సివిజన్ అందిస్తోందన్నారు. మాక్సివిజన్ రాబోయే రోజుల్లో తెలంగాణాలో మరో 20 కొత్త ఆసుపత్రులు, క్లినిక్‌లు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.