మొలకెత్తిన గింజలను తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు
మొలకెత్తిన గింజలను తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో పొటాషియం, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్, ఫైబర్, రైబోప్లావీన్ల్, విటమిన్ బీ 6 వంటి ఎన్నో పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు. నాణ్యమైన గింజలను సేకరించి, వాటిని మొలకెత్తించి తీసుకోవాలని చెప్తున్నారు.
దీని వలన శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. శరీరానికి కావలసిన పోషకాలు లభించడంతోపాటు త్వరగా ఆకలి వేస్తుంది. మొలకెత్తిన గింజల్లోని సీ విటమిన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
అంతేకాకుండా మొలకెత్తిన గింజలలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడతాయి. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పాటు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. శరీరం బలంగా దృఢంగా ఆరోగ్యవంతంగా తయారవుతుంది. మొలకెత్తిన గింజలు తినడం వలన శరీరంలో స్ఫూర్తి (శక్తి) పెరుగుతుంది. చర్మం నునుపు, మెరుపులో కూడా తేడా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.