Covid19 | మేలో పొంచి ఉన్న కొవిడ్ ముప్పు
Covid19 | విధాత: ప్రస్తుతానికి కోవిడ్ (Covid19) కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మే మధ్య నుంచి కోవిడ్ ప్రతాపం మొదలు కావచ్చని లూథియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, హాస్పటల్ అంచనా వేస్తోంది. ఈ వేవ్ జూన్ వరకు కొనసాగవచ్చని తన అంచనాల్లో పేర్కొంది. 2022 జనవరి నుంచి చూసుకుంటే ఇది మూడో ఒమిక్రాన్ వేవ్. దీని వల్ల 2022 ఏప్రిల్ 19న అత్యధికంగా 12,592 కేసులు నమోదు అయ్యాయి. అలాగే అత్యధిక మరణాలు అదే ఏడాది […]
Covid19 |
విధాత: ప్రస్తుతానికి కోవిడ్ (Covid19) కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మే మధ్య నుంచి కోవిడ్ ప్రతాపం మొదలు కావచ్చని లూథియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, హాస్పటల్ అంచనా వేస్తోంది. ఈ వేవ్ జూన్ వరకు కొనసాగవచ్చని తన అంచనాల్లో పేర్కొంది. 2022 జనవరి నుంచి చూసుకుంటే ఇది మూడో ఒమిక్రాన్ వేవ్.
దీని వల్ల 2022 ఏప్రిల్ 19న అత్యధికంగా 12,592 కేసులు నమోదు అయ్యాయి. అలాగే అత్యధిక మరణాలు అదే ఏడాది ఫిబ్రవరి 4 న నమోదయ్యాయి. ఒక ఏడాది వయసులోపు పిల్లలున్న వారు ఈ ఎండాకాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు పేర్కొన్నారు. వృద్ధులు, కిడ్నీ, గుండె ఇతర ఏ సమస్యలున్న వారైనా కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటించాలని సూచించారు.
ఒక వేళ ఎవరైనా కోవిడ్ టీకా వేయించుకోనట్లయితే వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. తాజా లెక్కల ప్రకారం.. గత వారం 21,798 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే అంతకు ముందు వారంతో పోలిస్తే ఈ సంఖ్య 50 శాతం తక్కువే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram