మేషం (Aries)
మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోడానికి, నైపుణ్యాలు వృద్ధి చేసుకోడానికి అనువైన సమయం. స్థానచలనం సూచన ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో తెలివిగా వ్యవహరిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు. ఆర్థికంగా అవసరానికి సరిపడా ధనం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. ప్రేమికుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విభేదాలను నివారిస్తే ప్రశాంతమైన జీవితం ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు ఉత్తమ ఫలితాలు కోసం సరైన ప్రణాళిక, కృషి అవసరం. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. సమయ పాలన, కష్టపడే తత్వంతోనే వ్యాపారంలో విజయాలు ఉంటాయి. పోటీదారులను తక్కువగా అంచనా వేయద్దు. ఆర్థికంగా సరైన ప్రణాళిక ఉంటే ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆశించిన ధనలాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలకు అవకాశం లేకుండా చూసుకోండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలను ఓర్పు, సహనంతో అధిగమించవచ్చు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కెరీర్లో విజయం సాధిస్తారు. సామాజిక సమావేశాలు, చర్చల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాల్లో గందరగోళం లేకుండా స్పష్టతతో ముందుకెళ్తే మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులు స్వీయ నిర్ణయాలతో ముందుకెళ్తే విజయం సిద్ధిస్తుంది. కెరీర్లో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతారు. గతంలో రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ధనలాభాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయి. పని ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటాయి. సమయపాలన, క్రమశిక్షణతో ఒత్తిడి అధిగమించవచ్చు. వ్యాపారులు ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రాజెక్టుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచిది. నష్టాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగడంతో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలకు చోటు లేకుండా చూసుకోవాలి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు కొంతకాలం వేచి ఉండడం మంచిది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలపై దృష్టి సారిస్తే మంచిది. స్థిరాస్తి, షేర్ మార్కెట్ రంగాల్లో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. శ్రేయోదాయకమైన కాలం కొనసాగుతోంది. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి విజయావకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో అనవసర చర్చలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది. బాధ్యతాయుతంగా నడుచుకోవడం వలన మేలు కలుగుతుంది. అధికారులతో సౌమ్యంగా వ్యవహరించాలి. ఓర్పు, నేర్పుతో ఉద్యోగంలో సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో ధన లాభాలతో పాటు పురోగతి కూడా ఉంటుంది. లక్ష్మీకటాక్షంతో ఐశ్వర్యవంతులవుతారు. స్థిరాస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన గృహయోగం ఉంది. కొన్ని శుభవార్తలు మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. సహోద్యోగులతో అపార్ధాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారంలో కృషికి తగిన ఫలితాలు ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలతో నష్టం కలుగుతుంది కాబట్టి అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంతో ముందుకెళ్తే ఆశించిన లాభాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. పొదుపు ప్రణాళికలపై దృష్టి సారించండి. ప్రేమ వ్యవహారాల్లో ఆనందం నెలకొంటుంది. ప్రేమికులు శుభవార్తలు వింటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ వారం శుభఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పదోన్నతులు అందుకుంటారు. ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులకు ఈ వారం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఊహించని లాభాలు ఆనందం కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటాయి. మనోబలంతో తీసుకునే నిర్ణయాల వలన శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తిలో, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అవగాహనతో అపార్ధాలు దూరం చేయవచ్చు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి పరమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగులు పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత పెంచాలి. బాధ్యతాయుతంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు మంచి అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులు పఠిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక నష్టాలు సంభవించకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. రుణాలు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయవద్దు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతో తగదు. ఘర్షణలు, వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు కృషి, పట్టుదలతో ప్రయోజనం పొందుతారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ పని పట్ల చిత్తశుద్ధితో ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద నష్టం కలిగిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారులు సన్నిహితుల సహాయంతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కృషికి తగిన ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఆర్థికంగా పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు ఆర్థిక సమస్యలకు కారణం కావచ్చు. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ముఖ్యం. జీవిత భాగస్వామి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం వల్ల మేలు జరుగుతుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం శ్రేయోదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక సుదూర ప్రయాణం ఉండవచ్చు. విద్యార్థులు ఆశించిన విజయాలు అందుకుంటారు. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు.