Raids At Former BRS Leaders Houses | బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు..హైడ్రామా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు, వాగ్వివాదాలతో హైడ్రామా. జనార్ధన్ రెడ్డి, రవీందర్ రావు ఆగ్రహం.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల తనిఖీ బృందాలు శుక్రవారం హైదరాబాద్ మోతినగర్ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీ లో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవిందర్ రావు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. దాదాపు 4గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా తమ ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారంటూ జనార్ధన్ రెడ్డి, రవింద్ రావులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో లేని మా ఇళ్లలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఏముంది? వారు ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వారిని ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ సోదాలతో కుట్ర చేస్తుందన్నారు. ఈ సందర్బంగా పోలీసులో వాగ్వివాదం, తోపులాట, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య ఎన్నికల అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram