ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాకౌట్

ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. డీఏ, పీఆర్సీ, సీపీఎస్‌పై హరీశ్ రావు ప్రశ్నలు.

BRS Walkout from Telangana Assembly

విధాత, హైదరాబాద్ : ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ శాసన సభ పక్షం సోమవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్ లో పెట్టిందని వాటిని ఎప్పుడు ఇస్తారు..పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, సీపీఎస్ ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ టి.హరీశ్ రావు డిమాండ్ చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా గత ప్రభుత్వంపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 88వేల మంది రిటైరయ్యారని, వారందరికి పెన్షన్ బెన్ ఫిట్లు చెల్లించామని గుర్తు చేశారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని హరీశ్ రావు ప్రకటించి పార్టీ సభ్యులతో కలిసి సభ నుంచి నిష్క్రమించారు.

గత ప్రభుత్వ హయాంలో మూడు డీఏ బకాయిలు పెండింగ్ పెట్టారు: భట్టి

బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన మూడు బకాయిలను ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించిందని, ఆనాడు వారు సక్రమంగా పనులు చేసి ఉంటే ఈ రోజు సమస్యలు వచ్చేవి కావు అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బదులిచ్చారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తాం అన్నారు. పీఆర్సీ, సీపీఎస్ వంటి అన్ని సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలతో మానవీయ కోణంలో, ప్రజాస్వామ్య బద్దంగా చర్చిస్తు చర్యలు తీసుకుంటున్నామని, వారికి హెల్త్ కార్డుల స్కీమ్ తెచ్చామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

అభివృద్దిని అడ్డుకోకండి.. మూసీ సుందరీకరణకు సహకరించండి: సీఎం రేవంత్ రెడ్డి
Mohanlal | అరుదైన చారిత్రాత్మ‌క ఘ‌ట్టం… 100వ సినిమాతో ఆ ఇద్ద‌రు స్టార్స్ మళ్లీ కలయిక

Latest News