Jubilee Hills Police Station : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత..పోలీసుల లాఠీచార్జ్
జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హైటెన్షన్! ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును సిట్ విచారిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన. పోలీసుల లాఠీచార్జ్ తో పరిస్థితి రణరంగంగా మారింది.
విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావును సిట్ బృందం విచారిస్తున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తత, లాఠీచార్జ్ లకు దారితీసింది. పోలీస్ స్టేషన్ లోపల సిట్ బృందం నాలుగు గంటల పాటు హరీష్ రావును విచారిస్తున్న క్రమంలో విచారణను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు స్టేషన్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కౌశిక్ రెడ్డిల రాకతో బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగించి లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లారు. దీంతో పోలీసులుకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట కొనసాగింది. వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. పోలీసులు లాఠీచార్జీతో బీఆర్ఎస్ ఆందోళన కారులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపం నుంచి దూరంగా తరిమికొట్టారు.
ఇవి కూడా చదవండి :
Delhi Metro : షాకింగ్.. ఢిల్లీ మెట్రో ప్లాట్‌ఫామ్‌పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు
Etela Rajendar : భూ చట్టాల అమలు లోసుగులతోనే భూ వివాదాలు జఠిలం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram