Blazing Hyderabad Hits 42.6°C; Weather Turnaround Expected in 48 Hours
హైదరాబాద్‌లో ఎండలు పీక్స్‌కు
నగరంలో 42.6°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ హీట్‌వేవ్ తీవ్రత పెరిగింది. అన్ని ప్రాంతాల్లో 42°C పైగా నమోదవడం గమనార్హం. రేపటి తర్వాత వర్షాలతో ఉపశమనం లభించే అవకాశం ఉంది.
విధాత వెదర్ డెస్క్ | మే 2, 2026 | హైదరాబాద్:
Hyderabad 42.6°C | హైదరాబాద్ నగరం అక్షరాలా అగ్నిగుండంలా మారింది. ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 42°C దాటిన ఉష్ణోగ్రతలు నమోదవగా, ముషీరాబాద్ – విఠల్వాడి ప్రాంతాల్లో 42.6°C నమోదు కావడం గమనార్హం. అయితే… ఇంకో రెండు రోజుల్లో ఉపశమనం కలుగుతుందని వాతావరణ శాఖ అంచనాలు.
నగరం మొత్తం నిప్పుల కుంపటి… అన్ని ప్రాంతాల్లో 42°C పైగా
ఎండల తీవ్రత నుంచి రక్షణ కోసం ముఖాలు కప్పుకుంటున్న ప్రజలు… జంతువులకు చల్లదనం కల్పిస్తున్న దృశ్యం
హైదరాబాద్‌లో ఎండలు అన్ని ప్రాంతాలను సమానంగా ప్రభావితం చేస్తున్నాయి. విఠల్వాడి, ముషీరాబాద్ ప్రాంతాల్లో 42.6°C నమోదు కాగా… చాంద్రాయణగుట్ట, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో 42.5°C నమోదయ్యాయి.
ఉప్పల్, ఎల్‌బీనగర్, సరూర్‌నగర్, మలక్‌పేట్, ఫలక్‌నుమా, బేగంబజార్, శేరిలింగంపల్లి, బీహెచ్ఈఎల్, బేగంపేట్ వంటి ప్రాంతాల్లో 42.4°C నమోదు కావడం నగరమంతా ఒకే విధమైన హీట్‌వేవ్ ప్రభావం ఉందని స్పష్టంగా చూపుతోంది.
చార్మినార్, కుత్బుల్లాపూర్, మూసాపేట్ ప్రాంతాల్లో 42.3°C, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 42.2°C, ఆల్వాల్‌లో 42.1°C నమోదయ్యాయి.
రేపటితో ముగింపు? వర్ష సూచనలతో ఉపశమనం
హైదరాబాద్ వీధుల్లో ఎండల నుంచి రక్షణ కోసం తిప్పలు
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపటితో ఈ హీట్‌వేవ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని, పిడుగులు–ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా:
- మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు బయటకు వెళ్లకూడదు
- ఎక్కువగా నీళ్లు తాగాలి
- తేలికపాటి దుస్తులు ధరించాలి
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎండలు శిఖరానికి చేరుకున్నా… ఇంకో 1–2 రోజుల్లో ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటివరకైతే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
