Changes In Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు
హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. నవంబర్ 3 నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.
విధాత, హైదరాబాద్ : ఈ నెల 3 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని పేర్కొంది.
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది. ఉద్యోగస్తులతో పాటు ఆ సమయాల్లో ప్రయాణించే వారికి నూతన వేళలు అనుకూలంగా ఉండి..మెట్రో ఆదాయం వృద్ధికి దోహదం చేస్తుందని ఆ సంస్థ భావిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram