iBomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో సీఐడీ ఎంట్రీ
ఐబొమ్మ పైరసీ కేసులో ఇమ్మడి రవిపై సీఐడీ కొత్త విచారణ ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వందల కోట్లు సంపాదించినట్లు గుర్తించిన అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.
విధాత, హైదరాబాద్ : సినీ పైరసీ నేరాలకు పాల్పడిన ఐబొమ్మ, బప్పం వైబ్ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో కొత్తగా సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. సెబర్ క్రైమ్ పోలీసుల కస్టడి విచారణ ఎదుర్కొంటున్న రవి కేసులో బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన నేరంపై సీఐడీ విచారణ చేస్తుంది. ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్‌లలో సినిమాల పైరసీతో పాటు గేమింగ్.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు రవి సంపాదించినట్లుగా సీఐడీ గుర్తించింది. నాలుగు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ను రవి కొనసాగించాడని గుర్తించిన సీఐడీ నిందితుడు రవి ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తుంది.
సెబర్ క్రైమ్ విచారణ వేగవంతం
మరోవైపు ఐబొమ్మ రవి కేసులో సెబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా పోలీసులు ఇమ్మడి రవిపై మరో 3 సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికే అతడిపై ఐటీ యాక్ట్, బీఎన్‌ఎస్ సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు కింద పలు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఫోర్జరీతో పాటు మరో 2 సెక్షన్లను జోడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram