ధాన్యం కొనుగోలు సమస్యలపై కవిత సచివాలయం ముట్టడి

ధాన్యం కొనుగోలు సమస్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సచివాలయం ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు. రైతుల పంటలను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యాసంగి ధాన్యం కొనుగోలు సమస్యలపై ఒకవైపు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ కొనసాగుతుండగానే..అదే సమస్యపై మరోవైపు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత సచివాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ పార్టీ శ్రేణులలో కలిసి సచివాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు..ధర్నా చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలను వ్యాన్‌లో, కవితను కారులో పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. పంట కొనుగోలు లేక రైతులు నానా అవస్థలు పడుతుంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదు అని విమర్శించారు. రెండున్నరేళ్లలో వ్యవసాయంపై సమీక్ష సైతం చేయలేదని, ధాన్యం, మక్కలు సహా ఏ పంట వేసిన రైతులైన అమ్మకాల్లో ఇబ్బందులు పడుతున్నారన్నారు. విత్తనాలు, ఎరువులు అందడం లేదని, పంట కొనడం లేదని, రైతు భరోసా ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే కల్లాల్లో ఉన్న వడ్లను, అన్ని రకాల పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్ : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
‘కాక్రోచ్ జనతా పార్టీ’తెలంగాణ సీఎం నేనే !

Latest News