‘కాక్రోచ్ జనతా పార్టీ’తెలంగాణ సీఎం నేనే !

కాక్రోచ్ జనతా పార్టీ తరఫున తానే తెలంగాణ సీఎం అభ్యర్థినని ఇర్ఫాన్ ప్రకటించారు. నిరుద్యోగం, చెట్ల నరికివేత, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలతో సటైరికల్ మ్యానిఫెస్టో విడుదల చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | May 22, 2026, 1:05 pm IST
Read Time: 3 mins
‘కాక్రోచ్ జనతా పార్టీ’తెలంగాణ సీఎం నేనే !

‘కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) తరఫున తానే తెలంగాణ సీఎం అభ్యర్థినని ఇర్ఫాన్ అనే యువకుడు ప్రకటించుకున్నారు. సెక్రటేరియట్ వద్ద ఆయన పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్బంగా సెల్ఫీ వీడియోలో మాట్లాడిన ఇర్ఫాన్… కేబీఆర్ పార్క్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చెట్ల నరికివేతను ఆపడం, నేరస్థులకు వీఐపీ ట్రీట్‌మెంట్ రద్దు చేయడం, గ్రూప్ పరీక్షల సక్రమ నిర్వహణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల వంటి అంశాలను తమ ఎజెండాగా పేర్కొన్నారు. తాము ‘6 గ్యారంటీలు’ అంటూ నకిలీ వాగ్దానాలు చేయబోమని స్పష్టం చేశారు. రైతు బంధు వంటి హామీలు చేయమని, ఫ్రీ విద్య,వైద్యం అందిస్తామని తెలిపారు.

వ్యవస్థలోని లోపాలపైన, ప్రభుత్వ వైఫల్యాలపైన, నిరుద్యోగ సమస్యలపైన ప్రశ్నిస్తూ..సెటైరిక్ ల్ పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ కొద్ది రోజుల్లోనే దేశంలోనే సోషల్ మీడియాలో అతిపెద్ద ఫాలోవర్స్ పార్టీగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎక్స్ సీజేపీ పార్టీ ఖాతాను బ్లాక్ చేసి షాక్ ఇచ్చింది. ఇన్ స్టాలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ తో కాక్రోచ్ పార్టీ దూసుకుపోతుంది. ఇది ఓ రకంగా దేశంలో జెన్ జీ విప్లవానికి సంకేతమని ప్రతిపక్షాలు, సామాజిక సేవా కార్యకర్తలు కామెంట్లు చేస్తుండటంతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Wake Up Telangana (@wakeuptelangana)

ఇవి కూడా చదవండి :

బజారులో బలుపు…రోడ్డుపై థార్ కార్లతో ఫైట్
10రాష్ట్రాలు…24రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల